Asianet News TeluguAsianet News Telugu

ఈ ఐస్ క్రీం 24 క్యారట్ గోల్డ్ .. తినాలంటే, ఎక్కడికో పోనక్కరలేదు.. హైదరాబాద్ లోనే దొరుకుతుంది.. ఎక్కడో చూడండి..

తమ ఐస్క్రీమ్ పార్లర్ కు ప్రత్యేకత తెచ్చేందుకు ఐస్ క్రీమ్ పార్లర్ 24 క్యారెట్ గోల్డ్ కోటెడ్ ఐస్ క్రీమ్ ని అందుబాటులోకి తెచ్చింది ఓ ఐస్ క్రీం పార్లర్. ఈ  ఐస్ క్రీమ్  ఎక్కడో కాదు మన హైదరాబాదులోని బంజారాహిల్స్ కు చెందిన హుబర్ అండ్ హల్లీ ఐస్ క్రీమ్ పార్లర్ లో దొరుకుతుంది.

This ice cream store in Hyderabad serves 24-carat gold ice cream
Author
Hyderabad, First Published Jan 14, 2022, 12:28 PM IST

ఏది చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. నోట్లో లాలాజలం గంగాప్రవాహంలా ఊటలు బారుతుందో అదే గోల్డెన్ ఐస్ క్రీం. అదీ 24 క్యారట్ గోల్డ్ తో చేసింది. చల్ల చల్లగా నోట్లో కరిగిపోతుంటే.. దాంతోపాటు బంగారమూ కడుపులోకి జారుతుంటే.. ఆహా.. ఆ మజాయే వేరు. అలాంటి అనుభూతిని కలిగిస్తోంది. హైదరాబాద్ లోని ఓ ఐస్ క్రీం పార్లర్.

24-carat gold ice cream గురించి అక్కడా, ఇక్కడా వినడమే కానీ.. చూడలేదనుకుంటున్నారా? అయితే అది ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. అది కూడా హైదరాబాద్, బంజారాహిల్స్ లోనే.. ధర కూడా అందుబాటులోనే ఉందంటున్నారు వ్యాపారులు. 

వ్యాపారం ఏదైనా వినియోగదారులను ఆకట్టుకోవడమే ప్రధానం. క్వాలిటీ. క్వాంటిటీతో పాటు ప్రత్యేకతను నిలుపుకునే వ్యాపారాలే ప్రజల్లోకి చొచ్చుకుపోతాయి. ఇదే క్రమంలో తమ ఐస్క్రీమ్ పార్లర్ కు ప్రత్యేకత తెచ్చేందుకు ఐస్ క్రీమ్ పార్లర్ 24 క్యారెట్ గోల్డ్ కోటెడ్ ఐస్ క్రీమ్ ని అందుబాటులోకి తెచ్చింది ఓ ఐస్ క్రీం పార్లర్. ఈ  ఐస్ క్రీమ్  ఎక్కడో కాదు మన హైదరాబాదులోని బంజారాహిల్స్ కు చెందిన హుబర్ అండ్ హల్లీ ఐస్ క్రీమ్ పార్లర్ లో దొరుకుతుంది.

మినీ మిడాస్..
బంజారాహిల్స్ లోని ఐస్ క్రీమ్ పార్లర్ లో వందలాది రకాలైన ఐస్క్రీమ్లు లభిస్తాయి.  కానీ ఈ పార్లర్ కి ప్రత్యేక తీసుకొచ్చింది మాత్రం మినీ మిడాస్ ఐస్క్రీమ్. వివిధ ఫ్లేవర్ లలో రుచికరంగా ఐస్ క్రీమ్ తయారు చేసిన తర్వాత చివరకు 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ ను అలంకరణగా అమరుస్తారు. దీంతో ఒక్కసారిగా ఐస్క్రీం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. అద్భుతమైన రుచి.. అందమైన రూపు కలిగిన ఈ ఐస్ క్రీమ్.. దాన్ని అందించే ఐస్ క్రీం పార్లర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది.

బంగారాన్ని తినొచ్చా? అనే సందేహం వద్దు. పురాణ కాలంనుంచి నేటివరకు బంగారం శరీరానికి మంచిది అని అనేకమంది వైద్యులు చెబుతూనే ఉన్నారు. అలాగని బంగారాన్ని కొరుక్కుతినడం కాదు. కొద్ది మొత్తంలో ఓ పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

అలా ఈ  ఐస్క్రీమ్ అలంకరణ లో ఉపయోగించే గోల్డ్ ఫాయిల్ ఎడిబుల్ అని పార్లర్ నిర్వాహకులు అంటున్నారు. ఈ ఐస్ క్రీమ్ 500 రూపాయల దగ్గర నుంచి లభిస్తుంది. గత నాలుగేళ్లుగా ఈ ఐస్క్రీం ఇక్కడ అందిస్తున్నారు. కాగా మరోసారి సోషల్ మీడియాలో ఈ ఐస్క్రీమ్ ట్రెండ్ అవుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios