కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పాతికశాతం అనుభవం లేనోళ్లే...
తెలంగాణలో ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64మంది దాదాపు 14మంది కొత్తవారే. అనుభవం లేనివారే.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. డిసెంబర్ 7వ తేదీన ప్రమాణస్వీకారంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఈ సారి ఎన్నికల్లో 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. ఈ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చాలామంది కొత్తవారు, అతి చిన్న వయస్కులు.. మొదటిసారిగా ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. వీరందరికీ రాజ్యాంగం, ఎమ్మెల్యేల విధులు, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు కొత్త అనే చెప్పాలి. దీనిమీద కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.
కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారందరికీ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. వీరితోపాటు ఎన్నికైన మిగతా ఎమ్మెల్యేలు అందరికీ కూడా.. ఎమ్మెల్యేల హక్కులు, వారి బాధ్యతలు, విధులు, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీ నియమ నిబంధనలకు సంబంధించినట్రైనింగును ప్రత్యేకంగా ఇస్తున్నారు. ఈ శిక్షణా తరగతులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో.. రాజకీయ వీశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ ఎల్లాలో ఈ తరగతులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈసారి కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఎ పోటీ చేసిన వారిలో.. అతి చిన్న వయస్కులు, తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు చాలామంది ఉన్నారు. ఒకసారి వారి జాబితా చూస్తే..
కాంగ్రెస్ చరిత్రలోనే తెలంగాణ సీఎం సరికొత్త రికార్డ్...
అతిచిన్న వయసులో ఎమ్మెల్యేలుగా గెలిచినవారు..
పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి
మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు
వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్
రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు..
చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారే.
నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకు జై వీర్రెడ్డి
నాగర్ కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేశ్వర్రెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నుంచి కే మదన్మోహన్రావు
తుంగతుర్తి నుంచి మందుల సామేల్ లు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు.
వీరితో పాటు ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య
ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాలేరు నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.