దుమ్మురేపిన బతుకమ్మ పాట నాసిరకం చీరలపై మహిళ ల కన్నెర్ర భువనగిరిలో నిరసన పాట పాడిన మహిళలు

కేసీఆర్ పంపిండు ఉయ్యాలో..
50 రూపాయల చీర ఉయ్యాలో..
ని బిడ్డ కడుతదా ఉయ్యాలో..
ని కోడలు కడుతదా ఉయ్యాలో..
మాకొద్దు ఈ చీర ఉయ్యాలో..
50రూపాయల చీర ఉయ్యాలో..
అంటూ అదిరిపోయే బతుకమ్మ పాట పాడిన్రు భువనగిరి మహిళలు. తెలంగాణ సర్కారు ఇచ్చిన చీరలు మహిళా లోకాన్ని చిన్నబుచ్చుకునేలా చేశాయి. నాసిరకమైన చీరలు పంపిణీ చేయడంతో మహిళలు ఆగ్రహంగా ఉన్నారు. కొన్నిచోట్ల జనాలు చీరలను కాల్చి నిరసన తెలిపారు. భువనగిరిలో మాత్రం చీరలు బాగాలేవంటూ మహిళలు పాడిన బతుకమ్మ పాట పలువురిని ఆకట్టుకుంటున్నది. అమాసకు, పున్నానికి ఒకసారి పాడినా... వాళ్ల పాట ప్రొఫెషనల్ సింగర్స్ ను తలదన్నేలా ఉందని జనాలు అంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
