పండుగ సందర్భంగా ప్రజలు ఇల్లు విడిచి తమ బంధువుల ఇంటికి, సొంతూళ్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇంట్లోని విలువైన వస్తువులు దొంగల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచనలు చేశారు. ఇంట్లోని విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలని అన్నారు. ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను అలెర్ట్ చేయాలని, కాలనీలోని సీసీ కెమెరాలను నడిచేలా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. దొంగలకూ వాట్సాప్ గ్రూపులున్నాయని అన్నారు. 

హైదరాబాద్: ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. దొంగలు(Thieves) ఇల్లు(House) లూటీ చేస్తారు. తాళం వేసి లైట్లు ఆఫ్ చేసి ఇల్లు కనిపిస్తే.. ఇంట్లో ఎవరూ లేరని దొంగలు ఇట్టే పసిగడుతున్నారు. చుట్టూ ఎవరూ లేనిది చూసుకొని ఇంట్లోకి దూరుతున్నారు. విలువైన వస్తువులు పట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా జారుకుంటున్నారు. అదీ పండగ సీజన్‌లలో చాలా మంది బంధువుల ఇళ్లల్లకు వెళ్తుండటం దొంగలకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాచకొండ సీపీ మహేష్ భగవత్(Rachakonda CP Mahesh Bhagawath) కీలక సూచనలు చేశారు. ప్రజలు తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్నట్టు సోషల్ మీడియాల్లో పోస్టు చేయకపోవడమే మంచిదని అన్నారు. తద్వారా తమకు తెలియని వ్యక్తులకూ ఈ కీలక సమాచారం చేరిపోతున్నదని వివరించారు.

ఇంటికి తాళం వేసి ఏరియా వదిలి బయట అడుగు పెట్టినట్టు అపరిచితులకు, ముఖ్యంగా ఆ విషయం దొంగలకు చేరకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నదని సీపీ మహేష్ భగవత్ అన్నారు. దొంగలకూ వాట్సాప్ గ్రూపులు ఉంటాయని వివరించారు. వారు కూడా ఇలాంటి కీలక విషయాలను చేరవేసుకునే అవకాశమూ ఉందని తెలిపారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు.

పండుగకు బంధువుల ఇళ్లకు, ఊళ్లలోకి వెళ్తున్న వారు తమ విలువైన వస్తువులు భద్రంగా బ్యాంకు లాకర్లలో దాచుకోవడం మేలని సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్లిపోవడమూ, తమ ప్రయాణంలో వెంట తీసుకెళ్లడమూ రెండూ ప్రమాదకరమేనని వివరించారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం మంచిదని తెలిపారు. డోర్‌కు వేసిన తాళం కనిపించకుడా కర్టెన్‌తో కప్పేయాలని పేర్కొన్నారు. గుమ్మం ముందు చెప్పులు విడిచి ఉంచడం, లోపల లైట్ వేసి ఉంచడం ద్వారా ఇల్లు ఖాళీగా లేదని దొంగలను నమ్మించవచ్చునని వివరించారు. తాము ఊరు వెళ్తున్నదని పక్కింటి వారికి తెలిపి వెళ్లడం ద్వారా దొంగలను ఏమార్చి ఇంటిలోని తమ విలువైన వస్తువులను కాపాడుకున్న వారమవుతామని పేర్కొన్నారు.

అపార్ట్‌మెంటుల్లోని వాచ్‌మెన్‌లను అలెర్ట్ చేసి పెట్టాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. అలాగే, కాలనీలకు చెందిన సీసీ కెమెరాలు ప్రభావవంతంగా పని చేసేలా చూసుకోవాలని వివరించారు. ఏమాత్రం అనుమానం వచ్చినా.. 100కి డయల్ చేయాలని తెలిపారు. అంతేకాదు, ఈ కార్యక్రమంలో ఆయన పండగ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే ఓ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఓ దొంగ తన 16వ యేట నుంచి దొంగతనం (Robbery) ప్రారంభించాడు. బెంగళూరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో గుట్టుగా ఇళ్లల్లోకి దూరడం.. చోరీ చేయడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. ఎవరికీ తెలియకుండా సొమ్మును కాజేసే చోర కళ ఆయన సొంతం. అంతేనా.. పోలీసులు (Police) పట్టుకున్నా.. కళ్లుగప్పి పారిపోవడంలోనూ దిట్ట. నమ్మించి అనుమాత్రం అనుమానం రాకుండా జారుకోవడంలో ఆయనను మించి లేరు. అందుకే పోలీసులే ఆయన పేరును కార్తీక్ (Escape Karthik) నుంచి ఎస్కేప్ కార్తీక్‌గా మార్చారు. ఎట్టకేలకు ఆయనను తాజాగా 17వ సారి అరెస్టు చేశారు. ఈ సారి ఆయన వెంట యువ పోలీసులను, అదనపు సిబ్బందినీ పంపినట్టు అధికారులు తెలిపారు.