పార్ట్ టైం జాబ్ కావాలని నెట్ లో సెర్చ్ చేసిన ఇద్దరు వ్యక్తులు సైబర్ క్రైమ్ వలలో పడ్డారు. పలు దపాలుగా వారిద్దరు ఆ మోసగాళ్లకు లక్షల రూపాయిలు ముట్టజెప్పారు. చివరికి మోసపోయామని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
టెక్నాలజీ పెరుగుతోంది.పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. టెక్నాలజీని మంచి విషయాల తెలుసుకోవడానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉపయోగించే వారికంటే.. చెడు దారిలో ఇతరులను మోసం చేయడానికి ఉపయోగించే వారే ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా పెరిగిన టెక్నాలజీని మనీ రిలేటెడ్ క్రైమ్స్ ను చేయడానికి వాడుతున్న వారు ఈ మధ్య ఎక్కువవుతున్నారు. ఈ తరహా మోసాల గురించి అవగాహన లేని వారు సులభంగా మోసాల బారిన పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మోసమే హైదరాబాద్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు సైబర్ మోసాగాళ్ల వలల చిక్కి డబ్బులు పోగొట్టుకున్నారు. వారు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీ, తెలంగాణలకు కేంద్రం పిలుపు: విభజన సమస్యలపై జనవరి 12న సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కీలక భేటీ
జీతం సరిపోకపోవడంతో...
హైదరాబాద్‌కు చెందని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఓ ఐటీ కంపెనీలో అతడు జాబ్ చేస్తున్నాడు. ఆ కంపెనీలో జాబ్ చేయడం వల్ల వచ్చే జీతం అతడికి సరిపోలేదు. దీంతో ఇంకో పార్ట్ టైం జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే దీని కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేశాడు. అయితే అతడు జెన్యూన్ వెబ్ సైట్స్ సెలెక్ట్ చేసుకోకుండా, తెలియకుండా ఫేక్ వెబ్ సైట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ వెబ్ సైట్ ద్వారా ఆ యువకుడికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పార్ట్ టైం జాబ్ వచ్చేంత వరకు కొంత పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మబలికాడు. దీనికి ఆ యువకుడు ఒప్పుకొని కొంత డబ్బు పంపించాడు. మళ్లీ కొంత కాలం తరువాత అలాగే డబ్బులు అడిగాడు. ఈ యువకుడు కూడా డబ్బు పంపించాడు. ఇలా పలుమార్లు అతడికి రూ. 6.40 లక్షల ముట్టజెప్పాడు. అయినా ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు. దీంతో మోసపోయానని ఆ యువకుడు గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రూ. 3 లక్షలు మోసపోయిన యువతి..
ఐటీ కంపెనీలో పని చేసే యువకుడు మోసపోయిన విధంగానే మరో యువతి కూడా సైబర్ క్రైం వలలో పడింది. పార్ట్ టైం జాబ్ కావాలని నెట్ లో సెర్చ్ చేస్తే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమె వద్ద నుంచి పలుమార్లు రూ.2.30 లక్షలు వసూలు చేశాడు. చివరికి జాబ్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం?.. కానీ అధికారులు మాత్రం ఏం చెబుతున్నారంటే..
పేమెంట్స్ యాప్ నుంచి డబ్బులు మాయం..
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు కూడా సైబర్ క్రైం బారిన పడ్డాడు. టెక్నాలజీ పెరిగిన తరువాత బ్యాకింగ్ రంగంలో కూడా పెను మార్పులు సంభవించాయి. ప్రతీ విషయానికి బ్యాంకుకు వెళ్లే పని లేకుండా యూపీఐ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో క్షణాల్లో ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపించవచ్చు. ఏ ప్రాంతంలో ఉన్నా ఇలా లావాదేవీలు జరపవచ్చు. దీనికి కావాల్సింది కేవలం స్మార్ట్ ఫోన్, దానికి ఇంటర్‌నెట్ కనెక్షన్. ఇటీవల కాలంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే, వంటి అనేక యూపీఐ పేమెంట్స్ యాప్ అందుబాటలోకి వచ్చాయి. అలాంటి ఓ భారత్ పే అనే యాప్ ద్వారా తనకు సంబంధం లేకుండానే రూ.3 లక్షలు గల్లంతయ్యాయని ఓ యువకుడు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
