Asianet News TeluguAsianet News Telugu

వారిది ఫ్యాంటసీ మాత్ర‌మే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల‌పై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్

Nizamabad MP Dharmapuri Arvind: నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందనీ, చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. "ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది. కొడుకు, కూతురు వల్లే కేసీఆర్ ఓడిపోతారని" అరవింద్ జోస్యం చెప్పారు.
 

Theirs is just fantasy, MP Dharmapuri Arvind slams Congress, BRS  RMA
Author
First Published Oct 29, 2023, 12:40 AM IST | Last Updated Oct 29, 2023, 12:40 AM IST

Telangana Assembly Elections 2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయా పార్టీల నేత‌లు విమ‌ర్శలు, ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటూ.. గెలుపుపై ఎవ‌రికివారే ధీమా వ్య‌క్తంచేశారు. ఈ క్ర‌మంలోనే నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందనీ, చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. "ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది. కొడుకు, కూతురు వల్లే కేసీఆర్ ఓడిపోతారని" అరవింద్ జోస్యం చెప్పారు.

అర‌వింద్ వార్తాసంస్థ  ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని అధికార పార్టీ కాపాడుతోందనీ, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమ‌ర్శించారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల్లో సగం మంది ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారని అర్వింద్ అన్నారు. అధికార పార్టీ మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం లేదనీ, ఎమ్మెల్సీ కవిత కేవలం మహిళా బిల్లు గురించి మాత్రమే మాట్లాడారనీ, మహిళలకు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలివైన వ్యక్తి అని అర్వింద్ విమర్శించారు. ఎందుకంటే ఆయ‌న డబ్బు సంపాదిస్తున్నాడు.. ఇదే స‌మ‌యంలో సభ్యులకు వాగ్దానాలు చేస్తున్నాడని విమ‌ర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల‌పై విమ‌ర్శ‌ల దాడిని పెంచుతూ వ‌చ్చే ఎన్నిక‌ల గురించి ఆ పార్టీలు ఫ్యాంట‌సీలో ఉన్నాయ‌ని అన్నారు. రానున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు అందరికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయ‌ని తెలిపారు. కాగా, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ, అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొననుందని నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios