ఇటీవలి కాలంలో వెరైటీ పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం మనం వింటూనే విన్నాం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ హిజ్రాను యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇటీవలి కాలంలో అన్ని వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లిల్ల విషయంలో చిత్ర విచిత్రమైన వార్తలు వింటున్నాం. ఇద్దురు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారనీ, ఇద్దరు ‘గే’ లు పెళ్లి చేసుకున్నారనే విషయాలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇలాంటి ఓ వెరైటీ వివాహం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ యువకుడు హిజ్రాను శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. భూపాలపల్లికి చెందిన రూపేశ్ (rupesh), ఆళ్లపల్లిలోని ఆనంతోగు ప్రాంతానికి చెందిన అఖిల (akhila) (హిజ్రా)కు మూడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరు కలిసి ఉండాలని భావించారు. అందులో భాగంగానే ఇల్లందు పట్టణంలో ఓ ఇంట్లో మూడు నెలల నుంచి కలిసి ఉంటున్నారు. సహజీవనం చేస్తున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎట్టకేలకు పెద్దలను పెళ్లికి ఒప్పించారు. దీంతో పెద్దల సమక్షంలో ఘనంగా వారి ఇద్దరి పెళ్లి జరిగింది.
ఇలాంటి పెళ్లి కొంత కాలం కిందట బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన మనోజ్ (manoj) అనే యవకుడు హిజ్రాను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు సబీ. ఈ పెళ్లిని కూడా వారిద్దరు పెద్దలను ఒప్పించి చేసుకున్నారు. మేళతాళాలు, వేద మంత్రాల మధ్య ఈ వివాహం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో స్థానికులు ఈ పెళ్లికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
కాగా ఇటీవల దామినేడులో కూడా ఇద్దరూ హిజ్రాలు పెళ్లి చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇద్దరు ‘గే’లు పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి ఒక రికార్డు సృష్టించింది. తెలంగాణలో ఇది తొలి గే వివాహంగా రికార్డులకు ఎక్కింది. హైదరాబాద్ లోని ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న సుప్రియో, సాఫ్ట్ వేర్ కంపెనీలో డెవలపర్ గా పని చేస్తున్న అభయ్ కు ఎనిమిదేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారి సింపుల్ గా పెళ్లి చేసుకోలేదు. పెద్దలను ఒప్పించి, వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్ ఫీల్డ్ లో ఘనంగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువుల, స్నేహితులు హాజరయ్యారు.
