భర్త ప్రవర్తన వల్ల తీవ్ర మానసిక క్షోభతో ఆ భార్య మృతి చెందింది. దీంతో భర్త కుటుంబ సభ్యులపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో తలదాచుకోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
భర్త సంసారానికి పనికి రాడని ఆమె తీవ్ర ఆవేదన చెందింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భర్త పలుమార్లు భార్యను కొట్టాడు. దీంతో వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి భార్య తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. కానీ భర్త విషయంలో ఆమె తీవ్ర మానసిక క్షోభ గురయ్యింది. ఈ ఆవేదనతో ఆమె మృతి చెందింది. దీంతో మృతురాలు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భర్త కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మాడ్గుల మండలం అర్కపల్లికి చెందిన మానసను ఆమె తల్లిదండ్రులు వనస్థలిపురం క్రిష్టియన్‌కాలనీకి చెందిన దేవిరెడ్డికి ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. భర్త ఓ మెడికల్ కంపెనీలో పని చేస్తున్నారు. భార్య మానస ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అయితే తన భర్త సంసార జీవితానికి పనికిరాడని మానస తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడం ప్రారంభించాయి.
ఈ క్రమంలో దేవిరెడ్డికి కోపం వచ్చింది. ఈ కమ్రంలో కొన్ని సార్లు మానసపై భర్త చేయిచేసుకున్నాడు. దీంతో పెద్దలు కలుగజేసుకొని భార్యాభర్తలకు నచ్చజెప్పారు. ఈ విషయంలో 2021 సంవత్సరంలో దేవిరెడ్డిపై మహిళా పోలీస్ స్టేషన్ మానస ఫిర్యాదు కూడా చేశారు.
అప్పటి నుంచి మానస తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెను తల్లిదండ్రులు ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకు తీసుకెళ్లారు. భర్తతో జరుగుతున్న గొడవలు కారణంగా ఆమె మానసికంగా తీవ్రంగా కలత చెందింది. దీంతో ఆ జాతర సమయంలోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.
గత కొన్నిరోజులుగా తమ కూతురు తీవ్ర మానసిక క్షోభతో ఉందని, అందుకే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మానస మృతదేహానికి భర్త దేవిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనికి భర్త కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇంటికి తాళం వేసి స్థానికంగా ఉన్న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
