75 ఏళ్ల లేటు వయసులో ప్రేమ మూడో మనువు కోసం ఆరాటం ఫ్యామిలీ నో చెప్పడంతో మనస్తాపం పురుగుల మందు తాగి ఆత్మహత్య 

ఓ వ్యక్తికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలతో సంసారం కలకలలాడుతున్నది. కానీ ఆయన మరో మహిళ మీద ప్రేమ కలిగింది. ఎలాగైనా ఆమెను మూడో పెళ్లి చేసుకోవాలని తలంచాడు. ఇంట్లో చెప్పాడు. ఇద్దరు భార్యలు పిల్లలు నో చెప్పారు. దీంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టిడి గుట్టకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి అబ్దుల్ రెహ్మాన్ వయసు 75 ఏళ్లు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఆయన సంతానంలో ఇంకా ముగ్గురికి పెళ్లిళ్లు కాలేదు. వారి పెళ్లిళ్ల విషయం మరచిన ఆ పెద్ద మనిషి తన మూడో పెళ్లి గురించి ఆరాటపడ్డారు.

ఇటీవల ఆ రెహ్మాన్ కు స్థానికంగా ఉంటున్న ఒక మహిళ పరిచయం అయింది. ఆమె మీద ప్రేమ కలిగింది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని తలంచాడు. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అయినా రెహ్మాన్ పట్టువీడలేదు. దీంతో కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరిగాయి.

ఎంత చెప్పినా కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో తట్టుకోలేక రెహ్మాన్ మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో పురుగుల మందు తాగిండు. ఆసుపత్రికి తీసుకెళ్తే చికిత్స పొందుతూ అర్థరాత్రి తర్వాత మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చూశారా..?లేటు వయసులో హాట్ ప్రేమతో ఆ పండుటాకు ప్రాణాలు కోల్పోయాడు.