Asianet News TeluguAsianet News Telugu

ఆరోగ్య సిబ్బంది సెలువుల‌ను రద్దు చేసే యోచ‌న‌లో తెలంగాణ‌ ప్ర‌భుత్వం

కరోనా డెల్టా వేరియంట్, ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ అలెర్ట్ అయ్యింది. ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

The Telangana government is planning to cancel health workers' leave
Author
Hyderabad, First Published Dec 20, 2021, 3:31 PM IST

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. మ‌రో వైపు క‌రోనా కొత్త వేవ్ ఓమిక్రాన్ కేసులు కూడా ఎక్కువ‌వుతుండ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్ర‌భుత్వ ఆరోగ్య సిబ్బంది సెలవుల‌ను ర‌ద్దు చేయాల‌ని భావిస్తోంది. అంద‌రూ వెంట‌నే విధుల్లో చేరాల‌ని సూచిస్తోంది. లాంగ్ లీవ్స్ పెట్టి వెళ్లిన వారంద‌రూ విధుల‌కు రావాల‌ని చెబుతోంది. 

15 వేలు దాటితే క‌ష్ట‌మే..
ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు అన్ని దేశాల‌కు విస్త‌రిస్తోంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించిన వివరాల ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు 38 దేశాల‌కు ఈ ఓమిక్రాన్ వైర‌స్ విస్త‌రించింది. మ‌న దేశంలోకి ఈ నెల ప్రారంభంలో ఈ వేరియంట్ ప్ర‌వేశించింది. ఈ ఇర‌వై రోజుల్లోనే 150కి పైగా కేసుల‌ను గుర్తించారు. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 54 కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో కేసులు పెరుగుతుండంతో ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. సెలవుల్లో ఉన్న వారంద‌రూ విధుల్లోకి రావాల‌ని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. లాంగ్ లీవుల్లో ఉన్న వారు కూడా జాయిన్ కావాల‌ని సూచించింది. 

ఈ దొంగ భలే చిలిపి... దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి, పోలీసు పర్సునే కొట్టేశాడు...

తెలంగాణ‌లో కింది స్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బంది ప‌ని చేస్తున్నారు. గ్రామాల్లో ఆశా కార్య‌క‌ర్త‌లు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ఏఎన్ ఎంలు, మండ‌ల పీహెచ్‌సీలో ఉండే డాక్ట‌ర్లు, అలాగే సీహెచ్‌సీలో ఉండే డాక‌ర్లు ఇలా వివిధ స్థాయిల్లో ఆరోగ్య సిబ్బంది ప‌ని చేస్తున్నారు. ఇందులో ఎవ‌రు సెలవుల్లో ఉన్నా.. వెంట‌నే వారంద‌రూ డ్యూటీలో జాయిన్ కావాల‌ని  అంత‌ర్గ‌తంగా ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడున్న ఆరోగ్య సిబ్బందితో కొంత వ‌ర‌కు ఓమిక్రాన్ కేసుల‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. తెలంగాణ‌లో దాదాపు 15 వేల ఓమిక్రాన్ కేసులు వ‌చ్చినా.. త‌ట్టుకునే శ‌క్తి తెలంగాణ ప్ర‌భుత్వానికి ఉంది. కానీ అంత ఎక్కువ‌గా వ‌స్తే మాత్రం ప్రైవేటు హాస్పిట‌ల్స్, కార్పొరేట్ హాస్పిట‌ల్స్ ఇందులోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంది.
అందుకే ప్ర‌భుత్వం అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది. మాస్కులు వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది. ప్రతీ ఒక్క‌రూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాల‌ని చెప్తోంది. ఇలా తీసుకోవ‌డం వల్ల హెర్ద్ ఇమ్యూనిటీ వ‌చ్చి కొత్త వేరియంట్‌ను త‌ట్టుకోవ‌చ్చ‌ని చెబుతోంది. జ‌న‌వ‌రి 15వ తేదీ నుంచి ఒమిక్రాన్ కేసులు పెరిగి, ఫిబ్ర‌వ‌రిలో అత్య‌ధికంగా న‌మోద‌వుతాయ‌ని తెలంగాణ ప్ర‌భుత్వ అధికారులు భావిస్తున్నారు. అందువ‌ల్ల ఆలోపే అంద‌రికీ దాదాపుగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని యోచిస్తోంది. అందుకే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. ఈ నెల చివ‌రి వ‌ర‌కు మొద‌టి డోసు దాదాపు 100 శాతం టార్గెట్ పూర్తి చేయాల‌ని భావిస్తోంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. 

ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం..: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

వేగంగా వ్యాపిస్తున్న ఓమిక్రాన్‌..
క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తిస్తోంది. ఈ వేరియంట్ తో ప్రాణ‌న‌ష్టం, హాస్పిట‌ల్‌లో చేరే అవ‌కాశం ఎక్కువ‌గా లేక‌పోయినా.. ఇది వ్యాపించడంలో మాత్రం వేగం చూపిస్తోంది. యూకేలో ఒక్క రోజులోనే 10 వేల‌కు పైగా కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయి. ఇది చాలా ఆందోళ‌న క‌లిగించే విష‌యం. డెల్టా వేరియంట్ కేసులు కూడా 90 వేలు న‌మోద‌య్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios