సోమేశ్ కుమార్ కేసులో తీర్పే డిజిపి అంజన్ కుమార్ తో పాటు మరో ఐదుగురికీ వర్తిస్తుంది.. హైకోర్టులో కేంద్రం వాదన..
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేసులో వెలువరించిన తీర్పే జిపి అంజన్ కుమార్ తో పాటు మరో ఐదుగురికి చెందిన పిటీషన్లలో వర్తిస్తుందని కేంద్రం హైకోర్టుకు నివేదించింది.
హైదరాబాద్ : ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేటాయింపుకు సంబంధించి వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ డే అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బుధవారం కేంద్రం దీనిమీద డిజిపి అంజన్ కుమార్ తో పాటు మరో ఐదుగురికి చెందిన పిటీషన్లలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేసులో వెలువరించిన తీర్పే వర్తిస్తుందంటూ హైకోర్టుకు తెలిపింది.
ఐఏఎస్, ఐపీఎస్ ల పిటీషన్లలో ప్రత్యూష్ కుమార్ సిన్హా కమిటీ ఉత్తర్వులు చెల్లవంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఆ సమయంలో సోమేశ్ కుమార్ వ్యవహారంలో ఈ కేటాయింపులు సబబేనంటూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విచారణలో కూడా ఇదే తీర్పు వర్తిస్తుందని కేంద్రం నివేదిస్తోంది.
వీడెవడో మామూలు దొంగకాదు... ఏకంగా కరీంనగర్ కలెక్టర్ నివాసంలోనే చోరీ (వీడియో)
బుధవారం నాడు డిజిపి అంజన్ కుమార్ తో పాటు మరో ఐదుగురికి చెందిన పిటిషన్లపై జరిగిన విచారణలో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బి నరసింహ శర్మ వాదనలు వినిపించారు. ఐపీఎస్ అధికారులైన రోనాల్డ్ రాస్, అంజనీ కుమార్, జె. అనంత రాము, ఎస్. ఎస్. రావత్, బిస్త్, అమ్రపాలిలా కేటాయింపులకు సోమేశ్ కుమార్ వ్యవహారంలో వెలువరించిన తీర్పే వర్తిస్తుందని తెలిపారు.
ఇక మిగిలిన పిటిషన్లు ఏవైనా ఉంటే అవన్నీ వ్యక్తిగత అంశాలకు చెందినవని చెప్పుకొచ్చారు. వాటిపై వాదనలో వినిపించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఈ వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. అన్ని పిటిషన్ల మీద నవంబర్ 15వ తేదీకి విచారణ వాయిదా వేసింది. వాద, ప్రతివాదులు తమ వాదనలను ఆలోపు నోట్ రూపంలో సంక్షిప్తంగా అందించాలని ఆదేశించింది.