ఓయూకు సీఎంకు పడటం లేదు. అందుకే కాబోలు ఆయన  ఉత్సవాలకు వచ్చినా మౌనంగానే ఉండిపోయారు.

తెలంగాణ ఉద్యమాన్ని తన మాటల తూటాలతో రగిలించిన ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ కు ఏమైంది...

 తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన నోరెందుకు మూగపోయింది.

ఓయూ పూర్వ విద్యార్థే అయినప్పటికీ సీఎం కేసీఆర్ తాను చదువుకున్న వర్సిటీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

100 ఏళ్ల ఓయూ ఉత్సవంలో మాట్లాడకుండా సీఎం కేసీఆర్ విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు.

సీఎం పీఠం ఎక్కినప్పటి నుంచి ఆయనకు విద్యార్థులు, మరీ ముఖ్యంగా ఓయూ ఉద్యమకారులంటే అస్సలు పడటం లేదు.గత ఎన్నికల ప్రచార వేళ కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు నినదించారు. ఆయన ఓయూ కు వచ్చినప్పుడు నిరసనలు తెలిపారు.

సీఎం అయ్యాక చాలాసార్లు ఓయూ భూములపై కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓయూ విద్యార్థులు మరింతగా ఆయనకు వ్యతిరేకులయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓయూలో నియామకాల నుంచి ఉద్యోగనోటిఫికేషన్ల వరకు సీఎం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఓయూ విద్యార్థులకు వ్యతిరేకంగానే వస్తూ ఉన్నాయి.

అందుకే ఓయూకు సీఎంకు పడటం లేదు. అందుకే కాబోలు ఆయన ఉత్సవాలకు వచ్చినా మౌనంగానే ఉండిపోయారు.

మరోవైపు ఉత్సవాల ప్రారంభంకంటే ముందే ఓయూ విద్యార్థులు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నినదించారు. ముందస్తుగా కొంతమందిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.