చంద్రబాబును నమ్మి కేసీఆర్ మీద నోరు చేసుకుంటే...

The leaders left Chandrababu were close associates of him
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని నమ్మి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై నోరు చేసుకున్న నేతల పరిస్థితి దారుణంగా తయారైంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని నమ్మి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై నోరు చేసుకున్న నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. కేసిఆర్ ఎదుర్కుని తెలంగాణలో పార్టీని నిలబెడుదామని ప్రయత్నించిన ప్రతి ఒక్క నాయకుడు టీడీపిని వదలాల్సిన పరిస్థితిలో పడ్డాడు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి పార్టీలో రెండు గ్రూపులు కొనసాగుతూ వచ్చాయి. ఓ గ్రూపు నాయకుడి చంద్రబాబు మద్దతు ఎల్లవేళలా దొరుకుతూ వచ్చింది. అలా చంద్రబాబు మద్దతు లభించి, చంద్రబాబు ప్రోత్సాహంతో దూకుడుగా వెళ్లిన నాయకులు చివరకు చతికిలపడాల్సిన స్థితి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉద్యమ కాలంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు, నాగం జనార్దన్ రెడ్డికి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. నాగం జనార్దన్ రెడ్డికి చంద్రబాబు అండదండలు లభిస్తూ వచ్చాయి. దాంతో ఆయన కేసిఆర్ పై మాటల యుద్ధం సాగిస్తూ వచ్చారు. చివరకు నాగం జనార్దన్ రెడ్డి పార్టీని వీడాల్సి వచ్చింది. ఆయన ప్రస్తుతం కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 

ఆ తర్వాత రేవంత్ రెడ్డిని చంద్రబాబు ప్రోత్సహిస్తూ వచ్చారు. చంద్రబాబు అండదండలతో ఆయన కేసిఆర్ పై దూకుడుగా విమర్శలు చేస్తూ వచ్చారు. కేసిఆర్ పై, కేసిఆర్ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి, మోత్కుపల్లి నర్సింహులుకు మధ్య పడేది కాదు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తన దూకుడు తగ్గించలేదు. 

కేసిఆర్ కు సవాల్ విసురుతూ వచ్చారు. కేసిఆర్ ను ఎదుర్కోగల దమ్మున్న నేతగా ఆయన గుర్తింపు కూడా పొందారు. చివరకు పొమ్మనలేక ఆయనకు పొగపెట్టారు. రేవంత్ రెడ్డి చివరకు కాంగ్రెసు పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. 

తాజాగా, మోత్కుపల్లి వ్యవహారం నడుస్తోంది. కేసిఆర్ ను ఎదుర్కోవడంలో మోత్కుపల్లి నర్సింహులు కూడా చాలా ధాటిగానే వాగ్బాణాలు విసురుతూ వచ్చారు. చంద్రబాబు సహకారం ఆయనకు దండిగా దొరుకుతూ వచ్చింది. మోత్కుపల్లి నర్సింహులుకు చంద్రబాబు అండదండలు ఉండడంతో ఆయనతో విభేదిస్తూ వచ్చిన ఉమా మాధవరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మోత్కుపల్లి కూడా చివరకు ఏదో ఒక పార్టీ చూసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. 

మోత్కుపల్లి నర్సింహులు ఏకంగా చంద్రబాబు పార్టీ నుంచే బహిష్కరించారు. ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. గతంలో తనపై తీవ్రమైన విమర్శలు చేసినవారిని కూడా కేసిఆర్ మన్నించి తన పార్టీలోకి తీసుకుంటున్నారు. అదే వరుసలో మోత్కుపల్లి ఉంటారనే ప్రచారం సాగుతోంది.

loader