తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కరోనా టీకా వేయించుకున్న జర్నలిస్టుగా సీనియర్ పాత్రికేయుడు పార్థసారథి నిలిచారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ఆయన టీకా తీసుకుని మొట్టమొదటి జర్నలిస్ట్ గా నిలిచారు. 

ప్రింటు , ఎలక్ట్రానిక్ మీడియంలో అపార అనుభవాన్ని గడించిన పార్థసారథి ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి మీడియా కన్సల్టెంటుగా పనిచేస్తున్నారు. ఈ రోజు బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో టీకా వేయించుకున్నారు. మీడియా రంగంలో ఇది తోలి టీకా కావడం విశేషం.

దేశవ్యాప్తంగా కోవిద్ వ్యాక్సినేషన్ నడుస్తోంది. జనవరి 16న మొదలైన వాక్సినేషన్ లో ఎంతోమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ టీకా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది స్వల్ప అస్వస్థతకు గురవుతున్నా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది.