Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ కు పరీక్షగా మునుగోడు ఉప ఎన్నిక...

బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు మునుగోడు ఉపఎన్నిక పరీక్షగా మారనుంది. తెలంగాణ సెంటిమెంట్, పేరు లేకుండా ఎన్నికలకు వెడితే ఏం జరుగుతుందోననే సందిగ్ధంలో క్యాడర్ ఉంది. 

The first by-election as a test for BRS
Author
First Published Oct 6, 2022, 1:30 PM IST

నల్గొండ : బీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నిక పరీక్షగా మారింది. రేపటి నుంచి 14 వరకు మునుగోడు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈలోగా అభ్యర్థి ప్రకటన, నామినేషన్ దాఖలుపై ఆలోచనా ధోరణిలో గులాబీ బాస్ ఉన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారా? లేక బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికలకు పోతారా? అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది. తెలంగాణ సెంటిమెంట్ పదం లేకుండా.. బీఆర్ఎస్ పేరుతో నామినేషన్ వేస్తే ఎలా అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది. 

దీంతో టిఆర్ఎస్ పేరుతోనే నామినేషన్లు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించింది. ప్రతి యూనిట్ కు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. 14 మంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలను ఇన్చార్జిగా నియమించింది. ఏడుగురు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లకు పూర్తి బాధ్యత అప్పగించింది. 

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతోనే బరిలోకి.. అప్పటివరకు అదే పేరు: క్లారిటీ ఇచ్చిన వినోద్ కుమార్..!

ప్రతి ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే, మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో ఎమ్మెల్యేకు 800 నుంచి 1200 మంది ఓటర్లు ఉన్నారు. మంత్రులకు అత్యధికంగా మూడువేల ఓటర్ల బాధ్యతలు అప్పగించారు. ప్రచారం చివరి రోజు వరకు నియోజకవర్గంలోనే ఉండాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

ఇదిలా ఉండగా, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలు చర్చించారు. ఈ ఏడాది నవంబర్ 3వ తేదీ తేదీన మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థిని బీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు. 

ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. అయితే పార్టీ మాత్రం అధికారికంగా అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి 86 యూనిట్గా బీఆర్ఎస్ విభజించి ఒక్కో యూనిట్కు ఎమ్మెల్యేలు, ఎంపీలకు బాధ్యతలను అప్పగించారు. తమకు కేటాయించిన యూనిట్లలో నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. కేటీఆర్, హరీష్ రావులు తమకు కేటాయించిన  గ్రామాల్లోనే ఉంటూ ప్రచారం నిర్వహించనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితిపై రెండు రోజుల క్రితం నేతలతో కెసిఆర్ చర్చించారు. మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేటీఆర్,  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,  పార్టీ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు వంటి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios