Asianet News TeluguAsianet News Telugu

వ్యాపారాభివృద్ది కోసం పూజలు చేస్తామని రూ.12.45 లక్షలకు కుచ్చుటోపి.. నైజీరియన్ల చేతిలో మోసపోయిన కంటి డాక్టర్

నైజీరియన్లు చేసిన సైబర్ మోసానికి ఓ కంటి డాక్టర్ బలైంది. ఏకంగా రూ.12.45 లక్షలు నష్టపోయింది. చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

The eye doctor who lost Rs.12.45 lakhs said that he would pray for business development
Author
First Published Jan 12, 2023, 2:52 PM IST

ఆమె ఓ ఉన్నత విద్యావంతురాలు. కంటి డాక్టర్ గా పని చేస్తున్నారు. సమాజంలో మంచి హోదాలో ఉంది. కానీ ఆమె ఓ నైజీరియా బ్యాచ్ మోసానికి బలైంది. మూఢనమ్మకాల బారిన పడకూడదని చెప్పే వృత్తిలో కొనసాగుతున్న ఆ డాక్టర్.. వాటినే నమ్మి లక్షలు పోగొట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండున్నర లక్షలను పొగొట్టుకుంది. తరువాత తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. 

విమానంలో కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన యువకుడు.. వీడియో వైరల్...!

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన కంటి డాక్టర్ కొంత కాలం కిందట సోషల్ మీడియాలో ఓ యాడ్ చూశారు. తాము ప్రేమ పూజారులం అని, ప్రార్థనలు చేసి సమస్యలను పరిష్కరిస్తామని అందులో ఓ నైజీరియన్ బ్యాచ్ పేర్కొంది. కుటుంబ సమస్యలను, అలాగే ఎలాంటి ఇతర సమస్యలున్నా తాము పరిష్కరిస్తామని చెప్పారు. అదే సమయంలో ఆమె ఓ ప్రేమ సమస్యతో సతమవుతోంది. ఈ యాడ్ ను నమ్మిన కంటి డాక్టర్ వెంటనే వారిని సంప్రదించింది. లక్ష రూపాయిలు వారికి అందించి వారితో పూజలు చేయించుకుంది. అనుకోకుండా జరిగిందో లేక ఈ పూజ ఫలితంగానో జరిగిందో తెలియదు గానీ ఆమె ప్రేమ సమస్య పరిష్కారం అయ్యింది.

బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు..

దీంతో ఆమెకు ఈ నైజీరియా బ్యాచ్ పై నమ్మకం కలిగింది. తమ వ్యాపార వృద్ధి కోసం వారితో పూజలు చేయించాలని నిర్ణయించుకుంది. మళ్లీ వారిని సంప్రదించింది. ఇంకేముంది మంచి అవకాశం దొరికిందనుకొని నైజీరియా బ్యాచ్ ఆమె నుంచి పలు దఫాలుగా వారికి రూ.12.45 లక్షలను లాగేసుకున్నారు. కానీ ఈ సారి ఆమె అనుకున్నట్టుగా జరగలేదు. వ్యాపారం లాభాల్లోకి రాలేదు. దీంతో తాను మోసపోయానని యువతికి అర్థం అయ్యింది. వెంటనే రాచకొండ పోలీసులను ఆశ్రయించింది.

మహబూబాబాద్ లో బీఆర్ఎస్ నూతన కార్యాలయం: ప్రారంభించిన కేసీఆర్

ఆమె ఫిర్యాదు ఆధారంగా రాచకొండ పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగించి నిందితులను గుర్తించారు. నైజీరియాకు చెందిన 41 ఏళ్ల ఓక్వుచుక్వు, 35 ఏళ్ల ఒబివారు జొనాథన్‌ ఉజ్కాను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మైకేల్‌ అజుండా, డానియల్‌ అనే వ్యక్తులు కొంత కాలం కిందట దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. దుస్తుల వ్యాపారం చేశారు. కానీ వారికి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వచ్చాయి. దీంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇలా మోసాలు చేయడాన్నే వృత్తిగా ఎంచుకున్నారు.

సెలవుల్లో ఉన్న సహోద్యోగులకు కాల్స్, మెయిల్స్ తో ఇబ్బంది కలిగిస్తే ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా !

ఇలా సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తూ.. తమ పూజలతో అద్భుతాలు చేస్తామని ప్రజలను నమ్మిస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఢిల్లీకి వెళ్లి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 6 సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీన పర్చుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios