Asianet News TeluguAsianet News Telugu

22 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలు వివాదం.. తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఏం చెప్పారంటే ?

గత ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ రవి గుప్తా ధ్రువీకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కొత్త వాహనాలను కొనుగోలు చేశామని తెలిపారు.

The dispute over the purchase of 22 Land Cruisers.. What did Telangana DGP Ravi Gupta say?..ISR
Author
First Published Dec 30, 2023, 12:50 PM IST

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో  22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ మీడియా సమావేశంలో అన్నారు. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ రవి గుప్తా స్పందించారు. సీఎం వ్యాఖ్యలను ఆయన ధ్రువీకరించారు.

శ్రీమంతురాలు కావాలని నలుగురిని పెళ్లి చేసుకున్న యువతి.. తరువాత ఏం జరిగిందంటే ?

భద్రతా కారణాల దృష్ట్యా ఈ కొత్త వాహనాలను కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. పలువురు ప్రముఖుల భద్రత అవసరాలకు అనుగుణంగా అవసరమైనన్ని వాహనాలు కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు. 

పట్టాలపై గ్యాంగ్ వార్.. ట్రైన్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి...

ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ఆశతో ఎన్నికలకు ముందు ఎవరికీ తెలియకుండా 22 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త వాహనాలు కొనొద్దని అధికారులకు చెప్పానని అన్నారు. కానీ గత ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసి విజయవాడలో ఉంచిందని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన 10 రోజుల వరకు ఈ విషయం తనకు కూడా తెలియదని అన్నారు.

తిరుమల మరో సారి చిరుత అలజడి.. అలిపిరి మెట్ల మార్గంలో కదలికలు

పాత వాహనాలకు రిపేర్లు చేసి వాటిని ఉపయోగించుకోవాలని తాను అధికారులకు సూచించానని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే గత ప్రభుత్వ సమయంలోనే 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేసినట్లు అధికారులు తనకు తెలియజేశారని చెప్పారు. అవి ఇప్పుడు విజయవాడలో ఉన్నాయని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వాటిని తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం భావించిదని చెప్పారు.

అయోధ్యలో ప్రధాని మోడీకి జననీరాజనం..

కొత్త వాహనాల గురించి అధికారులు తనకు చెప్పిన వెంటనే ఆశ్చర్య పోయానని రేవంత్ రెడ్డి తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావడంతో ఒక్కో వాహనం ఖరీదు రూ.3 కోట్లు ఉందని చెప్పారు. ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంపదను సృష్టించారని వ్యంగ్యంగా మాట్లాడారు.

Follow Us:
Download App:
  • android
  • ios