హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పెద్ద సమస్యే కాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. 

గురువారం నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  రాజకీయాలు ఎప్పుడూ కూడ ఓకే రకంగా ఉండవని ఆయన చెప్పారు.

also read:శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిపై కఠిన చర్యలు: కేటీఆర్

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్లు కూడ దక్కలేదన్నారు.  ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిందన్నారు. కానీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం సాధించిందన్నారు. అంతేకాదు అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక్క సీటు గెలుచుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది, కానీ ఆ తర్వాత జరిగిన  జనరల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందని ఆయన చెప్పారు. రాజకీయాల్లో గతంలో జరిగినట్టుగా ఇవాళ ఉండదని చెప్పారు. మారిన పరిస్తితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకొంటూ వెళ్లాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.