Asianet News TeluguAsianet News Telugu

మ‌హిళా పోలీసు ఇంట్లో భ‌ర్త‌కు దొరికిన సీఐ.. ఎక్క‌డంటే ?

ఓ మహిళ పోలీసుతో చనువుగా ఉంటున్న ఓ పోలీసును ఆమె భర్త పట్టుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది. 

The CI was found by the husband in the house of the female police officer. The incident occurred in Warangal Police Commissionerate.
Author
First Published Oct 4, 2022, 11:18 AM IST

వారిద్ద‌రూ పోలీసులు. ఒకే చోట విధులు నిర్వ‌ర్తిస్తారు. దీంతో వారి మ‌ధ్య చ‌నువు పెరిగింది. ఈ చ‌నువు వివేహాత‌ర సంబంధానికి దారి తీసిందేమో అని ఆ మ‌హిళా పోలీసు భ‌ర్త అనుమానించాడు. ఆయ‌న కూడా వేరే ప్రాంతంలో పోలీసుగానే విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలో మ‌హిళా పోలీసు ఇంట్లో వారిద్ద‌రూ మాట్లాడుకుంటుండ‌గా.. ఆమె భ‌ర్త వారిని ప‌ట్టుకున్నారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. 

టార్గెట్ టీడీపీ.. ఏపీ రాజకీయ నేతలపై కేసీఆర్ ఫోకస్..!

వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హనుమకొండ జిల్లాలోని రాంన‌గ‌ర్ ఏరియాకు చెందిన ఓ మ‌హిళ వ‌రంగ‌ల్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్ మెంట్ (CID) ఆఫీసులో సీఐగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఆదే ఆఫీసులో బలభద్ర రవి అనే మ‌రో వ్య‌క్తి కూడా సీఐగా పని చేస్తున్నారు. 

ఒకే చోటు ప‌ని చేస్తుండ‌టంతో వారిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్పడింది. దీంతో వారి మ‌ధ్య చ‌నువు కూడా ఎక్కువ అయ్యింది. ఇరువురి ఇళ్ల మ‌ధ్య రాక‌పోక‌లు సాగుతున్నాయి. ఒక‌రి ఇంటికి మ‌రొక‌రు వెళ్తూ వ‌స్తున్నారు. అయితే వీరి మ‌ధ్య చ‌నువు గ‌మ‌నించిన మ‌హిళా పోలీసు భ‌ర్త‌కు (ఆయ‌న కూడా పోలీసు డిపార్ట్ మెంట్ లో సీఐగా ప‌ని చేస్తున్నారు) అనుమానం క‌లిగింది. ప్ర‌స్తుతం అత‌డు మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో సీఐగా విధులు నిర్వ‌హిస్తున్నారు. వీరిద్ద‌రిని రెడ్ హ్యాండెండ్ గా ప‌ట్టుకోవాల‌ని కొంత కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కాకినాడలో కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు: క్రిస్టియన్ యూత్ ఫెలోషిఫ్ తీర్మానం

అయితే నిన్న (సోమ‌వారం) ఆ మ‌హిళా పోలీసు ఇంటికి, సీఐ బ‌ల‌భ‌ద్ర ర‌వి చేరుకున్నాడు. చాలా సేపు ప‌లు విష‌యాల‌ను వారిద్ద‌రు చ‌ర్చించుకున్నారు. వీరిద్ద‌రూ ఒకే చోట ఉన్నార‌నే విష‌యం ఆ మ‌హిళ భ‌ర్త‌కు తెలిసింది. దీంతో త‌న స్నేహితుల‌ను తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. వారిద్ద‌రి దగ్గ‌ర‌కు వెళ్లి ఇదేం తీర‌ని ప్ర‌శ్నించారు. తాము ఏ తప్పూ చేయ‌డం లేద‌ని, ఆఫీసుకు సంబంధించిన విష‌యాలు చర్చించుకుంటున్నామ‌ని ఆయ‌న‌కు వారిద్ద‌రూ చెప్పారు. కానీ దానికి మ‌హిళ భ‌ర్త సంతృప్తి చెంద‌లేదు.

అచ్చు సినిమానే: కడుపులో కొకైన్ తరలిస్తూ ఢిల్లీలో పట్టుబడిన విదేశీయుడు

వారిద్ద‌రూ ఎక్క‌డికి వెళ్ల‌నీయ‌కుండా స్నేహితుల‌తో కలిసి ఆపేశారు. వెంటనే సుబేదారీ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో వారు అక్క‌డికి చేరుకున్నారు. బ‌ల‌భ‌ద్ర ర‌విని వారి వెంట తీసుకెళ్లారు. దీనిపై మ‌హిళ భ‌ర్త అయిన సీఐ పోలీసుల‌కు ఫిర్యాదు అందించారు. త‌న అనుమ‌తి లేకుండా ర‌వి త‌న ఇంటికి వ‌స్తూ వెళ్తున్నార‌ని అందులో పేర్కొన్నారు. దీనిని ఆపాల‌ని చెప్పిన త‌న‌నే బెదిరింపుల‌కు గురి చేస్తున్నాడ‌ని ఫిర్యాదులో ఆరోపించారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై స్థానిక సీఐ షుకుర్ మాట్లాడుతూ.. ఆ ఇద్ద‌రి పోలీసుల మ‌ధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయ‌నే విష‌యం ద‌ర్యాప్తులో తెలుసుకుంటామ‌ని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios