Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ ఎలక్షన్స్ వేళ.. తెలంగాణలో ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

Mahabubnagar MLC by-election: పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణలో ఉప ఎన్నిక నగారా మోగింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.  ఈ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది.  

The bypoll for Legislative Council for election of Mahabubnagar Local Bodies Constituency MLC will be held on March 28 KRJ
Author
First Published Feb 27, 2024, 5:58 AM IST

Mahabubnagar MLC by-election: తెలంగాణ రాజకీయం రోజురోజుకు హీటెక్కుతోంది. లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ.. తెలంగాణ మరో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉప ఎన్నిక నిర్వహణ కోసం మార్చి  4న నోటిఫికేషన్ వెలువడనుండగా.. మార్చి 28న పోలింగ్ జరగనుంది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 4 నుండే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ  కసిరెడ్డి నారాయణ రెడ్డి  కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.ఇలా ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 

ఇది ఇలావుండగా.. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి  ఎమ్మెల్యేలుగా ఉన్న ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేవ్ కుమార్ గౌడ్, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లను ఆ స్థానాల్లో నియమించారు. అలాగే.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎంపికయ్యారు.

ఉపఎన్నిక షెడ్యూల్ ఇలా.. 

నోటిఫికేషన్ రిలీజ్ : మార్చి 4న

నామినేషన్లు ప్రారంభం : మార్చి 4 నుంచి

నామినేషన్లకు డెడ్‌లైన్ : మార్చి 11

నామినేషన్ల స్క్రూటినీ : మార్చి 12న

ఉపహంసరణకు గడువు : మార్చి 14న

పోలింగ్ : మార్చి 28న

ఓట్ల లెక్కింపు : ఏప్రిల్ 2న
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios