Asianet News TeluguAsianet News Telugu

కేవలం 8వ తరగతి చదివితే చాలు... నిరుద్యోగులకు టీజిఆర్టిసి గుడ్ న్యూస్ 

ఉన్నతచదువులు లేని నిరుద్యోగ యువతకు తెలంగాణ ఆర్టిసి గూడ్ న్యూస్ చెబుతోంది. కేవలం 8, 10 తరగతి అర్హత కలిగినవారికి అద్భుత అవకాశం కల్పిస్తోంది. 

TGRTC ITI Colleges invited applications from students  AKP
Author
First Published May 31, 2024, 9:40 AM IST | Last Updated May 31, 2024, 10:11 AM IST

హైదరాబాద్ : పెద్దగా చదువుకోలేకపోయి ప్రస్తుతం నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు తెలంగాణ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టిసి ఎండీ విసి సజ్జనార్ కీలక ప్రకటన చేసారు. ఉన్నత చదువులకు దూరమైన యువత గౌరవప్రదంగా స్వయం ఉపాధిని పొందే సువర్ణ అవకాశం ఆర్టిసి కల్పిస్తోంది... అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలి.  

 తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు వరంగల్ లో ఆర్టిసి సంస్థ ఐటిఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) కాలేజీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో యువతకు వివిధ ట్రేడ్ లలో శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే  తాజాగా మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. జూన్ 10 చివరి తేదీ... ఆలోపు దరఖాస్తు చేసుకున్నవారికి ఆర్టిసి ఐటిఐ కాలేజీలో శిక్షణపొందే అవకాశం దక్కుతుంది.  అర్హత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు... ఇందుకోసం https://iti.telangana.gov.in వెబ్ సైట్ ఉపయోగపడుతుంది. 
 
మోటార్ మెకానిక్ వెహికిల్ అయితే రెండేళ్ళు, మెకానిక్ డీజిల్ అయితే ఏడాది శిక్షణ వుంటుంది. ఇందులో ప్రవేశం కోసం పదో తరగతి చదివి వుండాలి.  ఇక పేయింటింగ్ శిక్షణకు కూడా రెండేళ్ళు, వెల్డింగ్ అయితే ఏడాది శిక్షణ వుంటుంది. ఇందులో ప్రవేశానికి  కేవలం 8వ తరగతి చదివినవారు కూడా అర్హులే.  పరిమిత సంఖ్యలో సీట్లు వుంటాయి కాబట్టి ఆసక్తి గలవారు తొందరగా దరఖాస్తు చేసుకోవాలి.   

ఆర్టిసి సంస్ధకు చెందిన ఐటిఐ కాలేజీల్లో నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ లభిస్తుందని విసి సజ్జనార్ తెలిపారు. యువతకు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించి బంగారు భవిష్యత్‌ అందించాలనే  ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. 

హైదరాబాద్‌, వరంగల్‌ లోని ఐటీఐ కాలేజీలో ప్రవేశం పొందినవారు కోరుకున్న ఆర్టిసి డిపోల్లో అప్రెంటిషిప్  చేసే సౌకర్యం కల్పిస్తామని సజ్జనార్ తెలిపారు.  స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఈ ఐటీఐ కోర్సులు వరంలాంటివన్నారు.  కాబట్టి ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే యువత హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించవచ్చు... లేదంటూ పూర్తి వివరాలను https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లోనూ చూడొచ్చని టీజిఆర్టిసి ఎండి సజ్జనార్ సూచించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios