Asianet News TeluguAsianet News Telugu

వరంగల్‌లో సినిమాటిక్ సన్నివేశం.. రాత్రికి రాత్రే వెలిసిన పోచమ్మ విగ్రహం.. మరుసటి రోజే ఊహించని ట్విస్ట్..

ఓ చోట రాత్రికి రాత్రే అమ్మవారు వెలిశారు.. దీంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పూజలు చేశారు. అయితే ఆ తర్వాతి రోజు విగ్రహాం అక్కడ కనిపించకుండా పోయింది. అయితే విగ్రహాన్ని పోలీసులే తొలగించారని భక్తులు ఆరోపిస్తున్నారు. 

Tension prevails over Goddess pochamma idol found and missing in warangal
Author
First Published Aug 18, 2022, 12:02 PM IST

ఓ చోట రాత్రికి రాత్రే అమ్మవారు వెలిశారు.. దీంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పూజలు చేశారు. అయితే ఆ తర్వాతి రోజు విగ్రహాం అక్కడ కనిపించకుండా పోయింది. అయితే విగ్రహాన్ని పోలీసులే తొలగించారని భక్తులు ఆరోపిస్తున్నారు. వరంగల్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాశీబుగ్గ ఓసిటీలోని స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి పోచమ్మ తల్లి విగ్రహాలను గుర్తించారు. ఇది తెలుసుకున్న సమీప ప్రాంతాల ప్రజలు బుధవారం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకన్నారు. విగ్రహాలకు పూజలు చేయడం ప్రారంభించారు. పోచమ్మ విగ్రహాల వద్ద కోళ్లను, యాటపోతులను బలిచ్చారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. 

అయితే ఈ విషయం జిల్లా క్రీడ శాఖ అధికారులు.. స్టేడియం వద్దకు చేరుకుని పరిస్థితి ని తెలిసిందే. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందివ్వడంతో అదనపు కలెక్టర్ హరిసింగ్ అక్కడి చేరుకున్నారు. పూజలు నిర్వహిసతున్న భక్తులతో మాట్లాడారు. స్టేడియంలో పూజలు చేయవద్దని అధికారులు భక్తులను కోరారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే భక్తులు మాత్రం పూజలు ఆపలేదు. 

సీన్ కట్ చేస్తే.. తెల్లవారేసరికి స్టేడియంలోని పోచమ్మ అమ్మవారి విగ్రహం కనిపించలేదు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ఆ విగ్రహాన్ని తొలగించారని ఆరోపిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని అక్రమించాలని కొందరు చూస్తున్నారని.. వారికి పోలీసులు సహకరిస్తున్నారనే కొందరి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఏది ఏమైనా విగ్రహాం అక్కడకి ఎలా వచ్చింది?, ఎలా కనిపించకుండా పోయింది? అనే అంశాలు తేలాల్సి ఉంది. ఈ పరిణామాలను గమనిస్తే అక్కడ ఏదో పెద్ద కథే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios