సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన కొండపాక మండలం ఎర్రవల్లిలో ఇళ్లు ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద నిర్మిస్తున్న ఇండ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో, గ్రామస్తులను తాత్కాలిక వసతి కేంద్రాల్లోకి తరలించేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు. 

అయితే దీనికి గ్రామస్తులు అడ్డు చెబుతున్నారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎర్రవల్లి గ్రామాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.