Asianet News TeluguAsianet News Telugu

లోటస్‌పాండ్ వద్ద ఉద్రిక్తత: అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడిని తన్నిన షర్మిల అనుచరుడు

హైద్రాబాద్ లోటస్ పాండ్ లో  బుధవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ ను వైఎస్ షర్మిల అనుచరుడు బూటుకాలితో తన్నాడు. ఈ విషయమై కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది.

Tension prevails at lotuspond after sharmila followers attacked on amaravati parirakshna samiti member lns
Author
Hyderabad, First Published Jun 30, 2021, 12:45 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ లోటస్ పాండ్ లో  బుధవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ ను వైఎస్ షర్మిల అనుచరుడు బూటుకాలితో తన్నాడు. ఈ విషయమై కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం చోటు చేసుకొంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని కూడ వ్యతిరేకిస్తోంది.

ఈ తరుణంలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను దక్కాల్సిందేనని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు.ఈ విషయమై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయమై అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు బుధవారం నాడు లోటస్ పాండ్ వద్దకు వచ్చారు. షర్మిలతో మాట్లాడాలని పట్టుబట్టారు. అదే సమయంలో లోటస్ పాండ్ లో షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం సమావేశం జరుగుతోంది.షర్మిలకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కొందరు నినాదాలు చేశారు. దీంతో సమావేశం నుండి బయటకు వచ్చిన షర్మిల అనుచరులు  అమరావతి పరిరక్షణ సమితి సభ్యులతో గొడవకు దిగారు.

ఈ సమయంలో షర్మిల అనుచరుడొకరు తనను బూటుకాలితో తన్నినట్టుగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. లోటస్ పాండ్ నుండి అమరావతి పరిరక్షణ సమితి సభ్యులను తరిమేశారు.  ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.  

Follow Us:
Download App:
  • android
  • ios