వరంగల్: తన చెల్లెలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించినందుకు గాను నాన్ బోర్డర్స్ తనపై దాడి చేశారని వెంకటేష్ అనే విద్యార్ధి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకొంది.

వెంకటేష్ అనే విద్యార్ధి సోదరి పట్ల కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని హస్టల్స్ లో ఉంటున్న నాన్ బోర్డర్స్ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయమై వెంకటేష్ స్పోర్ట్స్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

ఇదే విషయమై వెంకటేష్ మరోసారి స్పోర్ట్స్ డైరెక్టర్ ను ప్రశ్నించారు. స్పోర్ట్స్ డైరెక్టర్  చాంబర్ లోనే వెంకటేష్ పై నాన్ బోర్డర్స్ కొట్టారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినందుకు తనపై దాడి చేశారని బాధిత విద్యార్ధి వెంకటేష్ ఆరోపిస్తున్నాడు.తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు కేయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే వెంకటేష్ పై దాడిని విద్యార్ధి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బాధితుడిపై దాడి చేసిన నాన్ బోర్డర్స్ తో పాటు స్పోర్ట్స్ డైరెక్టర్ పై కూడ చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.