Asianet News TeluguAsianet News Telugu

తెలగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘ నేతల అరెస్ట్

తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు విద్యార్ధి సంఘాల నేతలు ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా నిర్వహించారు. ఇంటర్ విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరారు.

Tension Prevails after Students protest at Intermediate board in Hyderabad
Author
Hyderabad, First Published Dec 17, 2021, 12:28 PM IST

హైదరాబాద్:  తెలంగాణ Inter బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్ధి సంఘాలు శుక్రవారం నాడు ఆందోళన నిర్వహించాయి. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు ధర్నాకు దిగారు.దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఆందోళన చేస్తున్న విద్యార్ధి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇంటర్మీడియట్ First Year పరీక్ష ఫలితాలు గురువారం నాడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కనీసం 50 శాతం  Students కూడా ఉత్తీర్ణతను సాధించలేదు.

విద్యార్ధులను పరీక్షలకు సిద్దం చేయకుండానే పరీక్షలు నిర్వహించడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే విద్యార్ధులు ఫస్టియర్ లో ఫెయిల్ అయ్యారని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ద్వితీయ సంవత్సరం ప్రారంభమైన ఆరు మాసాల తర్వాత ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని విద్యార్ధి సంఘాల నేతలు చెబుతున్నారు.

also read:ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో 51 శాతం మంది ఫెయిల్.. అందుకేనా ?

విద్యార్ధులంతా తొలుత పాసైనట్టుగా ప్రకటించి ఆ తర్వాత రెండో సంవత్సరంలో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడంపై విద్యార్ధి సంఘాల నేతలు మండిపడుతున్నారు.   ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడానికి  ఇంటర్ బోర్డే కారణమని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్ధి సంఘాల నేతలు  శుక్రవారం నాడు Protest కు దిగారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.   మరో వైపు కనీస మార్కులతో విద్యార్ధులను పాస్ చేయాలని విద్యార్ధి సంఘ నేతలు డిమాండ్ చేశారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ ఫలితాలు రావడంపై  కూడా సర్వత్రా చర్చ సాగుతుంది.గఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ స్టూడెంట్ల‌కు ఈ ఏడాది అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు 4,59,242 మంది స్టూడెంట్లు హాజ‌ర‌వ‌గా.. 2,24,012 మంది పాస్ అయ్యారు. ఇందులో సగం కంటే ఎక్కువ అంటే 2,35,230 మంది ఫెయిల్ అయ్యారు. గ‌డిచిన కొన్నేళ్ల‌ల్లో ఇంత త‌క్కువ పాస్ ప‌ర్సంటేజ్ ఎప్పుడూ రాలేదు. గ‌తేడాది కంటే ఈ సారి 11 శాతం మంది స్టూడెంట్లు ఫెయిల్ అవ‌డం కొంత ఆందోళ‌న చెందాల్సిన అంశంమేబ.

ఇందులో ఫెయిల్ అయిన విద్యార్థులు డైరెక్ట్‌గా మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించే యాన్యువ‌ల్ ప‌రీక్ష‌ల స‌మ‌యంలోనే రాయాల్సి ఉంటుంది. ఈ స్టూడెంట్లు ఇప్ప‌టికే రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నారు కాబ‌ట్టి.. ఇటు సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు, అటు ఫ‌స్టియ‌ర్ ఫెయిల్ అయిన స‌బ్జెక్టుల‌కు ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది.ఈ సారి ప‌రీక్ష‌ల్లో కేవలం 49 శాతం మంది స్టూడెంట్లు పాస్ అయ్యార‌ని ఇంట‌ర్ బోర్డు తెలిపింది. ఇందులో ఈ సారి ఏ ఒక్క‌రూ కూడా 100 శాతం మార్కులు సాధించ‌లేదు. చాలా మంది బార్డ‌ర్ మార్కుల‌పై పాస్ అయ్యారు. ఇంట‌ర్ ఫ‌లితాల‌ను చూసి స్టూడెంట్ల త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన కొన్నేళ్ల‌లో ఇలాంటి ఫ‌లితాలను ఎక్క‌డా చూడ‌లేద‌ని చెప్తున్నారు. ఈ సారి ఉత్తీర్ణ‌త శాతం త‌గ్గ‌డానికి కార‌ణాలేంట‌ని విశ్లేషిస్తే ఎన్నో విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతాయి. ఇప్పుడు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులు మొద‌టి నుంచీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios