Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ కస్తూర్బా కాలేజీ వద్ద పేరేంట్స్ ఆందోళన, ఉద్రిక్తత: మేనేజ్‌మెంట్‌తో వాగ్వాదం



సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి  కస్తూర్బా కాలేజీ వద్ద  విద్యార్ధుల పేరేంట్స్  ఇవాళ  ఆందోళనకు దిగారు. అస్వస్థతకు గురైన విద్యార్ధుల  ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 

Tension prevails  after  parents  prorest  at  kasturba college in secunderabad,
Author
First Published Dec 27, 2022, 4:35 PM IST

హైదరాబాద్: సికింద్రాబాద్  వెస్ట్ మారేడ్ పల్లి  కస్తూర్బా కాలేజీ వద్ద  మంగళవారంనాడు  ఉద్రిక్తత  నెలకొంది.  విద్యార్ధుల పేరేంట్స్  కాలేజీ  ముందు  ఆందోళనకు దిగారు. అదే సమయంలో  ముగ్గురు విద్యార్ధినులు  అస్వస్థతకు గురయ్యారు.  అస్వస్థతకు గురైన విద్యార్ధినులను  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గత నెల  18న కాలేజీలోని  గ్యాస్ లీకైంది.  ఈ గ్యాస్ లీకేజీ కారణంగా  పలువరు విద్యార్థినులు  అస్వస్థతకు  గురయ్యారు. అస్వస్థతకు గురైన  విద్యార్ధులను  ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో  చికిత్స పొందిన తర్వాత విద్యార్ధులను  డిశ్చార్జీ చేశారు.  అయితే  డిశ్చార్జ్ అయిన  విద్యార్ధినులు అస్వస్థతకు  గురౌతున్నారు. దీంతో  వారంతా  ఆసుపత్రుల్లో  చికిత్స  తీసుకుంటున్నారు. అయితే  ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న విద్యార్ధినులు  మృతి చెందారని  ఇవాళ పుకార్లు  వచ్చాయి.  దీంతో  పెద్ద ఎత్తున  విద్యార్ధుల పేరేంట్స్  వచ్చారు.  కాలేజీ యాజమాన్యంతో  వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో  ముగ్గురు విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios