నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం దేదినేనిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాశన్న అనే వ్యక్తి హత్య గ్రామంలో ఉద్రిక్తతకు కారణమైంది.

కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన కాశన్న హత్య ఈ ఘటనకు కారణంగా మారింది. కాశన్నను ప్రత్యర్థులు హత్య చేశారు.

అయితే కాశన్నను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసే వరకు తాము కాశన్న డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించబోమని తేల్చి చెప్పారు. మూడు రోజులుగా కాశన్న మృతదేహంతోనే కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కాశన్న మృతికి రాజకీయ కక్షలే కారణమా ఇతర కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.