Asianet News TeluguAsianet News Telugu

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం, డీజీపీ ఆపీస్ వైపు వెళ్లే కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్

కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సైబర్ క్రైమ్  పోలీసులు సీజ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. సీఎం దిష్టిబొమ్మను గాంధీ భవన్ వద్ద దగ్దం చేశారు.  డీజీపీ కార్యాలయం వైపునకు వెళ్లేందుకు  ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్  చేశారు.
 

Tension Prevails  after Congress  workers  protest at Gandhi Bhavan
Author
First Published Dec 14, 2022, 1:47 PM IST

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో  కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను  సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ  డీజీపీ కార్యాలయం వైపునకు వెళ్లేందుకు  ప్రయత్నించిన  కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను  బుధవారంనాడు పోలీసులు  అరెస్టు చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త  సునీల్ కనుగోలు  మాదాపూర్ లో  కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాలయం నుండి  కాంగ్రెస్ పార్టీ  సోషల్  మీడియా కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా   పోస్టులు పెడుతున్నారని అందిన ఫిర్యాదుల మేరకు  మంగళవారంనాడు  ఈ కార్యాలయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు  సీజ్ చేశారు.  

కాంగ్రెస్ పార్టీ  వార్ రూమ్ ను  సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ  ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా  నిరసనలకు కాంగ్రెస్ పార్టీ  పిలుపునిచ్చింది. దీంతో  కాంగ్రెస్ పార్టీ నేతలను  హౌస్ అరెస్ట్  చేశారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి సహా  పలువురు కాంగ్రెస్ నేతలు  ఇవాళ గాంధీ భవన్  కు చేరుకున్నారు. గాంధీ భవన్ నుండి నేతలు  డీజీపీ కార్యాలయం వైపునకు వెళ్లేందుకు  ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో  కాంగ్రెస్ శ్రేణులు డీజీపీ ఆపీస్ వైపునకు వెళ్లకుండా గాంధీ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. బారికేడ్లను  దాటుకొని  డీజీపీ ఆఫీస్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేసిన  కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ సమయంలో  పోలీసులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు  చేసుకుంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు  గాంధీ భవన్ వద్ద  సీఎం కేసీఆర్  దిష్టిబొమ్మను  కాంగ్రెస్ కార్యకర్తలు దగ్దం చేశారు. గాంధీ భవన్ వద్దే బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. 

also read:నేడు నిరసలనకు పిలుపు: పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

 పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ ను  కాంగ్రెస్ పార్టీ నియమించుకుంది. కర్ణాటక రాష్ట్రంలో  కూడ కాంగ్రెస్ పార్టీకి  సునీల్ ఎన్నికల వ్యూహకర్తగా  ఉన్నారు.  సునీల్  సూచనలు, సలహా మేరకు ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. అయితే  సునీల్  కు చెందిన కార్యాలయాన్ని సీజ్  చేశారు.అయితే సునీల్ కార్యాలయంలో  తమ పార్టీకి చెందిన డేటాను  చోరీ చేశారని  కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.  పోలీసుల తీరును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios