సింగరేణిలో టెన్షన్.. యువకుడి అరెస్ట్

First Published 30, May 2018, 3:29 PM IST
Tension prevailed at Singareni, following the arrest of youth
Highlights

హాట్ న్యూస్..

నల్లబంగారం సింగరేణిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఉద్యమకారుడుగా పేరుపొందిన యువకుడు, సింగరేణి వారసత్వ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న రాజేష్ అనే యుకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సింగరేణి కార్మికులు, సింగరేణి యువకులు ఆందోళనలో ఉన్నారు.

ఎన్నికల హామీలను విస్మరించారని తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా సామజిక మాధ్యమాల వేదిక ద్వారా పోస్టులు పెట్టినందుకు రాజేష్ ఎర్రబెల్లి అనే యువకుడిని అరెస్టు చేశారని కార్మికులు చెబుతున్నారు. తక్షణమే రాజేష్ ను విడుదల చేయాలని కార్మిక సంఘాలు, వారసత్వ ఉద్యోగాల కోసం పోరాడుతున్న సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ కు వ్యతిరేకంగా రాజేష్ ఎర్రబెల్లి పోస్టులు పెట్టినట్లు చెబుతున్నారు.

loader