ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్‌తోనే సాధ్యమైందని ఆయనకు వీరాభిమానిగా  మారాడు. సీఎం గా కేసీఆర్‌ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసి ప్రజల్లో దేవుడిగా నిలిచిపోయాడని విశ్వసించాడు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ని అభిమానించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఓ వ్యక్తికి మాత్రం కేసీఆర్ కేవలం రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు. దేవుడితో సమానం. అందుకే ఆయన కోసం ఏకంగా గుడి కడుతున్నాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ల్లగొండ జిల్లా నిడమనూరు గ్రామానికి చెం దిన గోగుల శ్రీనివాస్‌ చౌటుప్పల్‌ పోలీ స్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్‌తోనే సాధ్యమైందని ఆయనకు వీరాభిమానిగా మారాడు. సీఎం గా కేసీఆర్‌ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసి ప్రజల్లో దేవుడిగా నిలిచిపోయాడని విశ్వసించాడు. 

గుడి కట్టించి నిత్యం పూజలు చేయాలనే ఉద్దేశ్యంతో నిడమనూరులో తనకున్న 10గుంటల స్థలంలో ఎలాంటి విరాళా లు వసూలు చేయకుండా సొంతడబ్బులతో గుడి నిర్మాణం మొదలు పెట్టాడు. కుటుంబ సభ్యులు సైతం ఆయనకు తోడుగా ఉంటూ గుడి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మండల కేంద్రంలోని ఆదర్శపాఠశాల సమీపంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. 

నిర్మాణం దాదాపుగా పూర్తికావస్తోంది. విగ్రహాన్ని కూడా తయారు చేయించడం జరిగింది. త్వరలో ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో ప్రారంభించాలనే కోరికతో ఉన్నాడు. నిడమనూరులో కేసీఆర్‌కు గుడి కడుతున్నారనే విషయం చర్చనీయాంశమైంది.