అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగుల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర్చేందుకు కృషి దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు దేవాదాయ శాఖ‌పై మంత్రివ‌ర్గ ఉప సంఘ స‌మావేశం
అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్నిచర్యలను తెలంగాణప్రభుత్వం తీసుకుంటుందని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది.
జీత భత్యాల విషయంలో దేవాదాయ శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికపై క్షుణ్ణంగా చర్చించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రంలో దేవాలయాలఅభివృద్ధి, దేవాదాయ శాఖను పటిష్ఠ పరచడం, అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీతభత్యాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో ఈవాళ భేటీ అయింది.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు నాయినినర్సింహ రెడ్డి, జూపల్లి కృష్ణ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ సమావేశమయ్యారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీత భత్యాలు ప్రధానఎజెండగా చర్చించారు. ఎస్టాబ్లిష్ మెంట్ ఎక్స్పెండిచర్ 30% లోగా ఉన్న ఆలయాలెన్ని,30% మించిన ఆలయాలెన్నిఉన్నాయో వివరాలను తెలుపుతూ, ఒప్పంద ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ , రోజు వారీగా వేతనాలు తీసుకుంటున్న సిబ్బంది వివరాలన్నింటినిఅందజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. దేవాదాయ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది.
