అయ్యో అని మనం ఎప్పుడంటామో తెలుసా? బాధ కలిగినా, ఆశ్చర్యం కలిగినా, సానుభూతి చూపుతున్నప్పుడు అయ్యో అంటాము. ఈ మాట ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించుకుంది.

అయ్యో అని మనం ఎప్పుడంటామో తెలుసా? బాధ కలిగినా, ఆశ్చర్యం కలిగినా, సానుభూతి చూపుతున్నప్పుడు అయ్యో అంటాము. ఈ మాట ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించుకుంది.

అయ్యో అనే మాటను మనం నిత్యజీవితంలో గంటకు ఒకసారి అయినా వాడకుండా ఉండలేము. కానీ ఈ మాటకు అర్థం మన భాషలోనే ఉంది. ఇంగ్లీషులో దానికి అర్థం లేదు. కానీ ఇప్పుడు ఆ మాటకు ఇంగ్లీషులోనూ అర్థం ఉంది.

నిజానికి అయ్యో అనే మాట దక్షిణ భారత దేశంలోని తెలుగు, కన్నడం, మలయాలం, తమిళం మాట్లాడేవారిది. దక్షిణాది భాషల్లో అయ్యో అనే మాటను తరచుగా వింటుంటాం. ఇక నుంచి ఈమాటకు ఆంగ్లంలో కూడా అర్థం ఉంటుంది.

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఈ పదం చోటు దక్కించుకోవడం మనందరికి హ్యాపీ కదా?