తాజాగా విడుదలైన జేఈఈ మొదటి విడత పరీక్షల్లో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. దేశం మొత్తం మీద 14 మంది పూర్తి స్థాయిలో మార్కులు సాధించగా ఇందులో మన రెండు రాష్ట్రాల నుంచి 8 మంది స్టూడెంట్లు ఉన్నారు.
జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. తాజా ఫలితాల్లో దేశం మొత్తం మీద 100 పర్సంటైల్ కేవలం 14 మందికే వచ్చింది. అయితే అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచే ఏడుగురు ఉన్నారు. గుంటూరుకు చెందిన పెనికల పాటు రవి కిషోర్ 300 మార్కులు సాధించారు. ఈ పరీక్షలో మొత్తంగా 300 మార్కులే ఉంటాయి కాబట్టి ఆ విద్యార్థికే మొదటి ర్యాంకు వచ్చే అవకాశం ఉంది.
అమరావతిపై పిటిషన్లు: నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు
మొదటి విడత ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి. అయితే చివరి విడత పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు ముగిసిన తరువాత.. మొదటి పరీక్షలో ఉన్న వచ్చిన ఫలితాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ ర్యాంక్ ను విడుదల చేస్తారు. అయితే కేటగిరీల ప్రకారం తుది కటాఫ్ స్కోర్ ను ప్రకటిస్తారు. అందులో అర్హత సాధించనవారే జేఈఈ అడ్వాన్డ్స్ రాయాల్సి ఉంటుంది.
తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు.. ఏపీలో 5 జిల్లాలకు హై అలెర్ట్
మొదటి విడత మెయిన్స్ కోసం దేశం మొత్తం మీద 8,72,432 మంది స్టూడెంట్లు అప్లయ్ చేసుకున్నారు. కాగా అందులో 7,69,589 మందే పరీక్షకు హాజరయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 1.25 లక్షల మంది పరీక్షకు హాజరై ఉంటారని తెలుస్తోంది. గత నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించారు.
ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు: కృష్ణా జిల్లాలో వివాహిత సూసైడ్
ఈ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తెలుగు విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెనికలపాటి రవికిశోర్ టాప్ లో నిలవగా.. పొలిశెట్టి కార్తికేయ, బోగి సిరి లు వరుసగా 100, 99,9984 పర్సంటైల్ సాధించారు. అలాగే కొయ్యాన సుహాస్ 100 పర్సంటైల్, సనపాల జశ్వంత్ 99,9984 సాధించారు. వీరితో పాటు దయ్యాల జాన్ జోసెఫ్ 99.9953, నూతక్కి రిత్విక్ 99, 9750 పర్సంటైలు సంపాదించారు. మంచి స్కోర్ సాధించిన అమ్మాయిల్లో దరిసిపూడి శరణ్య, బోగి సిరి, జానపాటి సాయిచరిత, నక్కా సాయి దీప్తిక, పల్లి జలలక్ష్మి లు ఉన్నారు. వీరు తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిల విభాగంలో టాపర్లుగా నిలిచారు. ఇందులో శరణ్య 99,9984 పర్సంటైల్ సాధించగా, సిరి 99, 9984 పర్సంటైల్ సాధించారు. అలాగే సాయి చరిత 99, 9968 సాధించగా.. సాయి దీప్తిక 99.9922, జల లక్ష్మి 99, 9875లు సాధించారు. అలాగే తెలంగాణ నుంచి ధీరజ్ కురుకుంద, రూపేశ్ బియానీ, జాస్తి యశ్వంత్ వీవీఎస్, అనికేత్ ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిలో ఉన్నారు.
