ప్రముఖ కవి అయిల సైదాచారి ఆరోగ్యం విషమం

First Published 4, May 2018, 10:21 AM IST
Telugu poet Aila Sydacahary hospitalised: Condition critical
Highlights

 ప్రముఖ కవి అయిల సైదాచారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

హైదరాబాద్: ప్రముఖ కవి అయిల సైదాచారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  మెదడుకు సంబంధించిన వ్యాధితో ఆయన హైదరాబాదులోని గచ్చిబౌలిలోని సన్ షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. 

గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. నల్లగొండకు చెందిన ఆయన హైదరాబాదులో స్థిరపడ్డారు. సైదాచారికి భార్య శివజ్యోతి, కూతురు ఆలాపన ఉన్నారు. 

సైదాచారి వెంటిలేటర్ పై ఉన్నారు. భార్య శివజ్యోతి కూడా కవయిత్రి. ఆలాపన హోమియోపతి వైద్య కోర్సు చదువుతున్నారు. సైదాచారి ఆమె నా బొమ్మ, నీలంమాయ అనే కవితా సంపుటులను వెలువరించారు. 

సైదాచారి కవిత్వం తెలుగులో ఓ అద్భుతమైన సరికొత్త రూపాసారాల శాశ్వత శిలాక్షరమని ఆయన మిత్రుడు, కవి దెంచనాల శ్రీనివాస్ అన్నారు. తెలుగు కవిత్వంలో అందరూ నడిచే దారిన కాకుండా తనదైనా దారి వేసుకుని ముందుకు సాగాడు. 

loader