హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.అందరూ చూస్తుండగా కత్తితో 30 ఏళ్ల వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. దాంతో షకీర్ ఖురేషీ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

నిందితుడిని అబ్దుల్ ఖాజాగా గుర్తించారు. గత నెలలో అత్తపూర్ లో నడి రోడ్డుపై ఓ వ్యక్తిని నరికి చంపిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పాతబస్తీ మీర్ చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఈ తాజా సంఘటన చోటు చేసుకుంది. 

నడిరోడ్డుపై ఓ వ్యక్తిని నరికి చంపుతున్నా కూడా అడ్డుకునేందుకు పోలీసులు కూడా ముందుకు రాలేదు. తన చెల్లెపై అత్యాచారం చేసి ఆమెను చంపుతానని బయపెట్టినందుకు ఖురేషీని చంపినట్లు అబ్దుల్ చెబుతున్నాడు.

మృతుడు షకీర్ ఖురేషీ ఆటో రిక్షా డ్రైవర్. అతను చంచల్ గుడాలో ఉంటున్నాడు. తాము ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయామనే ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. 

"

"

సంబంధిత వార్తలు

అత్తాపూర్ మర్డర్: విక్రం సింగ్ అరెస్ట్

అత్తాపూర్ మర్డర్: రమేష్ హత్యకు ముందు కిషన్‌ ఏం చేశాడంటే?

అత్తాపూర్ మర్డర్‌లో ట్విస్ట్: సంచలన విషయాన్ని బయటపెట్టిన సోదరుడు

అత్తాపూర్ మర్డర్: 'కొడుకా.. నీ వద్దకే రమేష్‌ను పంపా'

అత్తాపూర్‌ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...

10 నెలల క్రితం కొడుకు హత్య: అత్తాపూర్ మర్డర్ వెనుక కారణమిదే(వీడియో)