Asianet News TeluguAsianet News Telugu

మీడియా మొగల్ రామోజీరావు అస్తమయం... తెల్లవారుజామున కన్నుమూత 

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు కన్నుమూసారు.  

Telugu Media legend Ramoji Rao passed away AKP
Author
First Published Jun 8, 2024, 7:18 AM IST

హైదరాబాద్ : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తుదిశ్వాస విడిచారు.తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి రాజకీయ, సినీ  వ్యాపార ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. 

జూన్ 5న శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్న రామోజీరావును కుటుంబసభ్యులు నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి స్టెంట్ అమర్చారు. అయినప్పటికి ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు... మరింత క్షీణించడంతో వెంటిలేటర్ పై వుంచి చికిత్స అందించారు.  

అయితే నిన్న(శుక్రవారం) రామోజీరావు ఆరోగ్య  పరిస్థితి మరింత విషమంగా మారింది. చివరకు ఇవాళ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య ఆయన కన్నుమూసారు... ఈ మేరకు రామోజీరావు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios