రాడిసన్​ డ్రగ్​ కేసులో కీలక పరిణామం.. ముందస్తు పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న క్రిష్

Director Krish: డ్రగ్స్ పార్టీ కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్​ డైరెక్టర్​ జాగర్లమూడి క్రిష్ ​కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు బెయిల్ ​కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను సోమవారం వాపసు తీసుకున్నారు. కేసు నమోదైన వెంటనే జాగర్లమూడి క్రిష్​  ముందస్తు పిటిషన్  దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Telugu film director Krish Withdraws Anticipatory Bail Plea in Hotel Drug Party Case KRJ

Director Krish: ఇటీవల డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు సినీ దర్శకుడు క్రిష్ అలియాస్ రాధాకృష్ణ జాగర్లమూడి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల క్రితం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డైరెక్టర్ సోమవారం ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి కేసు నమోదైన వెంటనే జాగర్లమూడి క్రిష్​ ముంబయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇలా తనను నిందితుడిగా పేర్కొన్న వెంటనే క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

మరోవైపు.. విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించగా శుక్రవారం వస్తానని క్రిష్ చెప్పాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణకు రావాలని సిఆర్‌పిసి సెక్షన్ 41-ఎ కింద  రెండో నోటీసు జారీ చేశారు. ఇలా పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే అరెస్టు అవసరం లేకుండానే విచారణకు హాజరుకావాలని క్రిష్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మాదాపూర్​ డీసీపీ వినీత్​ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో అతని మూత్ర, రక్తం, వెంట్రుకల నమూనాలను సేకరించారు. మూత్రం పరీక్షల్లో రిజల్ట్​ నెగెటీవ్ ​అని వచ్చింది. దీంతో సోమవారం క్రిష్​ జాగర్లమూడి పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా ఆయన తరపు న్యాయవాది ముందస్తు బెయిల్​ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు.
 

అదే సమయంలో క్రిష్.. డ్రగ్ పార్టీలో తన ప్రమేయాన్ని ఖండించారు. పార్టీని నిర్వహించినట్లు ఆరోపించిన ప్రాథమిక నిందితుడు గజ్జల వివేకానంద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తనను ఎలా నిందితుడిగా పేర్కొంటారని ప్రశ్నించారు. నిందితుల్లో ఇద్దరు లిషి, సందీప్‌లకు నోటీసులు అందజేసి వారి రక్తం, మూత్ర నమూనాలను సేకరించి మాదాపూర్‌ పోలీసులకు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ను గుర్తించకుండా ఉండేందుకు లిషి హెయిర్‌కట్‌ చేయించుకుని జుట్టుకు రంగు వేసుకుందని పోలీసులు తెలిపారు. ఆమెకు ఇతర పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
ఎవరైనా 0.5 గ్రాముల కంటే తక్కువ నార్కోటిక్ తీసుకుంటే రక్తం, మూత్రంలో (ఒక వారం తర్వాత) కొకైన్‌ను గుర్తించడం కష్టమని సోర్సెస్ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు.. నిందితులు జుట్టుకు రంగు వేయడం, గోళ్లను కత్తిరించడం, డిటాక్స్ డైట్‌ని అనుసరించడం వంటి చర్యలను  కూడా పాటిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios