కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఓ తెలుగు కుటుంబం హిమాలయాల్లో చిక్కుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన గోపాల్ తన ఐదుగురు కుటుంబసభ్యులతో కేదార్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు.

కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఓ తెలుగు కుటుంబం హిమాలయాల్లో చిక్కుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన గోపాల్ తన ఐదుగురు కుటుంబసభ్యులతో కేదార్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. అయితే, భారీ వర్షాల కారణంగా మార్గమధ్యంలోని వంతెన కూలిపోవడంతో అక్కడ చిక్కుకుపోయారు.

ఎటు వైపు వెళ్లాలో తెలియక.. ఏం చేయాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు. తమను రక్షించాలంటూ గోపాల్ షేర్ చేసిన గూగుల్ మ్యాప్స్ ఒక్కటే ఇప్పుడు వారిని రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం. దీంతో కుటుంబసభ్యులు గోపాల్‌ను కాపాడాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారు షేర్ చేసిన దాన్ని బట్టి వారు ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.