ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 3 రోజుల పాటు ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి 21 మందితో ముసాయిదా కమిటీని నియమించింది అధిష్టానం. ఇందులో పలువురు తెలుగు నేతలకు కూడా స్థానం కల్పించింది.  

ఈ నెల 24 నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ముసాయిదా కమిటీలో రఘువీరా రెడ్డి, కొప్పుల రాజుకు స్థానం కల్పించారు. అంశాలవారీగా చర్చించేందుకు 6 ఉప బృందాలను నియమించారు. ఉప బృందాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు చోటు కల్పించారు. రాజకీయ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఉప బృందంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. ఆర్ధిక వ్యవహారాలపై ఉప బృందంలో సంజీవరెడ్డి, జేడీ శీలంకి స్థానం కల్పించారు. అంతర్జాతీయ వ్యవహారాలపై ఉప బృందంలో ఎంఎం .పల్లంరాజుకు చోటు కల్పించారు. యువత, విద్య, ఉద్యోగాల వ్యవహారాలపై ఉపబృందంలో జిగ్నేష్ మేవాని, కన్హయ్య కుమార్‌లకు కూడా స్థానం కల్పించారు.