Telugu AKademi Scam : స్కామ్ సొమ్ముతో వివాదాస్పద భూముల కొనుగోలు.. అవే ఎందుకంటే...
ఏసీపీ మనోజ్ కుమార్ నేతృత్వంలోని అధికారులు ఈ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కొన్ని అనుమానాస్పద అంశాలపై మాత్రం నిందితులను కలిసి విచారిస్తూ వాస్తవాలను నిర్ధారించుకుంటున్నారు. ప్రధాన నిందితుడు సాయి కుమార్ telugu akademi scamలో తన వాటాగా 20 కోట్లకు పైగా తీసుకున్నాడని ఇప్పటివరకు గుర్తించారు.
హైదరాబాద్ : తెలుగు అకాడమీ లో చోటుచేసుకున్న రూ. 64.5 కోట్ల కుంభకోణంపై దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ డబ్బుల్లో అధిక మొత్తం కాజేసినట్లు ఆరోపణలు ఉన్న ప్రధాన సూత్రధారి సాయికుమార్ వివాదాస్పద భూములు ఖరీదు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయని ఈ పని చేసినట్లు భావిస్తున్నారు.
కాగా, ఇప్పటివరకు అరెస్టు అయిన 14 మందిలో తొమ్మిది మందిని CCS పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. telugu akademi అకౌంట్స్ అధికారి రమేష్, FDల విత్ డ్రా లో దళారులుగా వ్యవహరించిన సాయి కుమార్, నందూరి వెంకట రమణ, వెంకటేశ్వరరావు, సోమశేఖర్ లతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్ బ్రాంచ్ మాజీ మేనేజర్ మస్తాన్వలి, ఏపీ మర్కంటైల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మజ, మొయినుద్దీన్ లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఏసీపీ మనోజ్ కుమార్ నేతృత్వంలోని అధికారులు ఈ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కొన్ని అనుమానాస్పద అంశాలపై మాత్రం నిందితులను కలిసి విచారిస్తూ వాస్తవాలను నిర్ధారించుకుంటున్నారు. ప్రధాన నిందితుడు సాయి కుమార్ telugu akademi scamలో తన వాటాగా 20 కోట్లకు పైగా తీసుకున్నాడని ఇప్పటివరకు గుర్తించారు.
ఇతను 5 కోట్లతో పెద్ద అంబర్పేట్ లో 34 ఎకరాల వివాదాస్పద భూములు కొనుగోలు చేశాడని, ఆ భూముల పత్రాలను కొందరి వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడని తెలిసింది. ఇవి తక్కువ ధరకు రావడంతో పాటు భవిష్యత్తులో తాను అరెస్టు అయినప్పటికీ ఈ భూములను పోలీసులు స్వాధీనం చేసి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో మరో నిందితుడు వెంకటరమణ కొండాపూర్, ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్నంలో సుమారు రూ. 6.5 కోట్లు వెచ్చించి మూడు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అందించనున్నట్లు సమాచారం.
ఈ కుంభకోణంలో మరికొందరు నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా జుడిషియల్ రిమాండ్ లో ఉన్న చందానగర్ కెనరా బ్యాంక్ మాజీ మేనేజర్ సాధన పోలీసు కస్టడీ పిటిషన్ పై హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలుగు అకాడమీ కుంభకోణంపై ED అధికారులు విచారణను వేగవంతం చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో శుక్రవారమే కోర్టు అనుమతి తీసుకున్న ఈడీ, శనివారం చంచల్ గూడ జైల్లో అకాడమీ ఇన్ ఛార్జ్ అకౌంటెంట్ రమేష్ ను ప్రశ్నించింది. బ్యాంకు ఎఫ్ డీల నుంచి డ్రా చేసిన డబ్బులు ఎవరెవరు, ఎంతెంత తీసుకున్నారు. తమ వాటాగా తీసుకున్న డబ్బులను ఏం చేశారు అన్న అంశాలపై కూపీ లాగినట్టు తెలిసింది.
Telugu akademi scam: మాజీ డైరెక్టర్ పీఏ వినయ్‌కుమార్ లీలలెన్నో, రూ. 12 లక్షలు సీజ్
కాగా, ఈడీ దర్యాప్తు బృందం సోమవారం బ్యాంకు మేనేజర్లను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. కెనరా బ్యాంకుతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లను ప్రశ్నించి ఎఫ్ డీ సొమ్మును ఎక్కడికి తరలించారన్న సంగతిని రాబట్టాలని భావిస్తోంది. అలాగే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సాయి కుమార్ తన వాటాగా వచ్చిన డబ్బును ఎక్కడికి తరలించాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడు అన్న అంశాలను గుర్తించి వాటిని జప్తు చేయాలని ఈడి ప్రయత్నిస్తోంది.
మరోపక్క ఇద్దరు బ్యాంకు మేనేజర్లు వారి వాటాగా వచ్చిన డబ్బును కుటుంబ సభ్యుల ద్వారా మళ్లించినట్లు సిసిఎస్ తన దర్యాప్తులో స్పష్టంచేసింది. ఆ డబ్బులను హవాలా మార్గాల్లో తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మేనేజర్లతో పాటు మిగతా నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది.