Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ ఐడీలతో ఖాతాలు... తెలుగు అకాడమీ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. బ్యాంక్‌ల నుంచి రూ.64 కోట్లను ఎఫ్‌డీల రూపంలో వీరు కాజేసినట్లు  పోలీసులు తేల్చారు. సోసైటీలో తెలుగు అకాడమీ పేరుతో ఫేక్ ఐడీలు రూపొందించారు నిందితులు

telugu academy scam case updates
Author
Hyderabad, First Published Oct 1, 2021, 7:28 PM IST

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. బ్యాంక్‌ల నుంచి రూ.64 కోట్లను ఎఫ్‌డీల రూపంలో వీరు కాజేసినట్లు  పోలీసులు తేల్చారు. సోసైటీలో తెలుగు అకాడమీ పేరుతో ఫేక్ ఐడీలు రూపొందించారు నిందితులు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఖాతాలు తెరిచారు నిందితులు. వీరిపై సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదు చేశారు. నిందితులపై 154/2021, u/sec, 409, 419, 420, 465, 467, 468, 471 R/w 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు.   

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో హైదరాబాదు నగర క్రైమ్ బ్రాంచ్ (సీసీఎస్) పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ సొసైటి బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రాజును పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల బదలాయింపులో సత్యనారాయణ రాజు కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అలాగే ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉద్యోగి మొహినుద్దీన్ ను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తెలుగు అకాడమీకి చెందిన డబ్బులను ఆ బ్యాంకుకు బదిలీ చేసినట్లు, అక్కడి నుంచి ఒకరి ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు. 

తెలుగు అకాడమీ దాదాపు 34 బ్యాంకుల్లో నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అకాడమీ అధికారులు రెండు లేదా మూడు నమ్మకమైన బ్యాంకులను ఎంపిక చేసుకుని ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయకుండా అన్ని బ్యాంకుల్లో ఎందుకు చేశారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆ బ్యాంకుల్లో తమ నిధులు భద్రంగా ఉన్నాయా, లేవా అని గుర్తించే పనిలో తెలుగు అకాడమీ అధికారులు పడ్డారు. 

ఆ బ్యాంకులను గుర్తించి, వాటిలో డబ్బులు భద్రంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి దాదాపు 20 మంది ఉద్యోగులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. వాళ్లంతా బ్యాంకులను గుర్తించలేక సతమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యాంకులు ఎక్కడెక్కడో ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఆ డిపాడిట్లు అలా ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారనే విషయాలను కనిపెట్టే పని కూడా మరో వైపు జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios