తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, మానవ జీవితంలో జంతుశాస్త్రం పాత్రపై ప్రసంగం (వీడియో)

telugu academy golden jubilee celebrations
Highlights

తెలుగు భాషాభివృద్ది కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అయితే గత 49 సంవత్సరాలుగా ఈ అకాడమీ తెలుగు ప్రజలకు తన నిరంతర సేవలను అందిస్తూ 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. 

తెలుగు భాషాభివృద్ది కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అయితే గత 49 సంవత్సరాలుగా ఈ అకాడమీ తెలుగు ప్రజలకు తన నిరంతర సేవలను అందిస్తూ 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. నాటి నుండి నేటి దాకా తెలుగు బాషా సాహిత్య గ్రంథాలు,  పాఠ్య పుస్తకాల ముద్రణ, తెలుగు నిఘంటువుల తయారీ, మాతృభాషా పరిశోధన వంటి వాటిని ఈ తెలుగు అకాడమీ చెపట్టింది. సమాజానికి, విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి పనులు చేయడం వల్లే ఈ సంస్థ ఖ్యాతి రోజు రోజుకూ తెలుగు ప్రజల్లో పెరుగిందే కానీ తరగలేదు.

అయితే 50 సంవత్సరాల సుధీర్ఘ ప్రస్తానాన్ని పూర్తిచేసుకున్న  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ  నిష్ణాతులైన ప్రముఖులతో వివిధ అంశాలపై ప్రసంగాలను ఇప్పిస్తున్నారు. ఇలా ఇవాళ మానవ జీవితంలో జంతుశాస్త్రం యెక్క పాత్రపై ప్రసంగం సాగింది. ఇందులో భాగంగా జంతు శాస్త్రం నిత్య జీవితంలో మానవులకు ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రసంగంలో వివరించారు. 

వీడియో

"

loader