తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, వృక్షశాస్త్ర వైవిధ్యంపై ప్రసంగం (వీడియో)

telugu academy golden jubilee celebrations
Highlights

తెలుగు భాషా అభ్యున్నతికి పాటుపడుతున్న తెలుగు అకాడమీ గురించి తెలంగాణలో తెలియనివారుండరు. అయితే తన ప్రాభవాన్ని కోల్పోతున్న మాతృభాషను కాపాడటానికి ఈ సంస్థ చేస్తున్న కృషి సాధారనమైనది కాదు. ఈ  కార్పోరేట్ కాలంలో, ఇంగ్లీష్ మోజులో కూడా కాస్తో కూస్తో తెలుగు భాష ఆదరణను పొందుతుందంటే అందుకు కారణం ఇలాంటి సంస్థలే అనడంలో అతిశయోక్తి లేదు. 

తెలుగు భాషా అభ్యున్నతికి పాటుపడుతున్న తెలుగు అకాడమీ గురించి తెలంగాణలో తెలియనివారుండరు. అయితే తన ప్రాభవాన్ని కోల్పోతున్న మాతృభాషను కాపాడటానికి ఈ సంస్థ చేస్తున్న కృషి సాధారణమైనది కాదు. ఈ  కార్పోరేట్ కాలంలో, ఇంగ్లీష్ మోజులో కూడా కాస్తో కూస్తో తెలుగు భాష ఆదరణను పొందుతుందంటే అందుకు కారణం ఇలాంటి సంస్థలే అనడంలో అతిశయోక్తి లేదు. 

అయితే గత 49 ఏళ్లుగా తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన తెలుగు అకాడమీ 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా అకాడమీ అధికారులు విద్యార్థులకు ఉపయోగపడేలా విషయ నిపుణులతో వివిధ అంశాలపై ప్రసంగాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ వృక్షశాస్త్ర వైవిధ్యం పై వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో ప్రసంగం సాగింది. వృక్ష శాస్త్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు,  వైవిధ్యం గురించి వారు వివరించిన తీరు సభికులను ఆకట్టుకుంది. 

వీడియో

"

loader