బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం వెంకటరావు: కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గానికి చెందిన  తెల్లం వెంకటరావు  కాంగ్రెస్ ను వీడి ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన  గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 

Tellam Vankat Rao Joins in BRS  lns

హైద్రాబాద్: తెలంగాణలో  కోటి ఎకరాల్లో  సాగు  జరుగుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలోని  భద్రాచలానికి చెందిన తెల్లం వెంకట్రావు  గురువారంనాడు  మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.  ఈ ఏడాది జూలై  4వ తేదీన  పొంగులేటి ఆధ్వర్యంలో   వెంకట్రావు  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా  హైద్రాబాద్  తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ లో చేరిన  వెంకట్రావు భవిష్యత్తుకు  తాము  భరోసా ఇస్తున్నామని  కేటీఆర్ ప్రకటించారు.కాంగ్రెస్ ను నమ్ముకుంటే  కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని  మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ ను నమ్ముకుంటే  కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని  మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.  తమ ప్రభుత్వం  ప్రాజెక్టులను పునరుద్దరించడంతో  రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ చెప్పారు.రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తామని కేటీఆర్  ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయం విపక్షాలకు కూడ తెలుసునన్నారు.ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు. 

ఒకప్పుడు మనం అనుకునే తెలంగాణ కోటి రతనాల వీణ... ఇవాళ కోటి ఎకరాల మాగానంగా మారిందన్నారు. దీనికి కేసీఆర్  కారణమని మంత్రి చెప్పారు. మన ముఖ్యమంత్రి జాతిని మేల్కొల్పిన తర్వాత మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని జల్జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్రం తీసుకు వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌ఘడ్ లో పోడు భూములకు పట్టాలిచ్చారా అని  మంత్రి ప్రశ్నించారు.  తెలంగాణలో నాలుగు లక్షల 50 వేలు ఎకరాల పోడుభూమి పట్టాలు ఇచ్చినట్టుగా ఛత్తీస్‌ఘడ్ లో ఇస్తారా అని  ఆయన  కాంగ్రెస్ ను ప్రశ్నించారు.  రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నారా అని ఆయన  ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు అమలు చేస్తున్న  పథకాలను  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా అని కేటీఆర్ అడిగారు. 

 

మరి రైతులకు సహాయం చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఒకప్పుడు చెప్పిన సమ సమాజ స్థాపన ఇప్పుడు సాగుతుందన్నారు. అన్ని వర్గాల వారికి సమాజంలో అందరికీ అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.పేద రైతులకు సంక్షేమ పథకాలు ఇస్తే  ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా  రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను  తీసుకుంటూ కేసీఆర్ పై విమర్శ చేయడం అలవాటుగా మారిందని ఆయన  కాంగ్రెస్ పై  మండిపడ్డారు.  

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని  కేటీఆర్ గుర్తు చేశారు .యాదాద్రి స్థాయికి తగ్గకుండా భద్రాద్రి రామాలయ అభివృద్ధిని  కేసీఆర్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.  తిరిగి అధికారంలోకి రాగానే...  భద్రాద్రి రాముడి గుడిని అద్భుతంగా పునర్నిర్మిస్తాం.. ఈ  విషయంలో  ఎవరికీ  అనుమానాలు అవసరం లేదని కేటీఆర్  ధీమాను వ్యక్తం  చేశారు.
 

.. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios