Telangana: గత కొన్ని నెలలుగా పెరిగిన గ్రీన్ ట్యాక్స్, లైఫ్ టాక్స్, రోడ్ టాక్స్, ఫిట్‌నెస్ పెనాల్టీలు వంటి పన్నులను తగ్గించాలని తెలంగాణ డ్రైవర్లు రోడ్డెక్కారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2020 అమలుతో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
protest against fuel price hike: పన్నులు, పెనాల్టీల పెంపునకు వ్యతిరేకంగా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ ఆటో, క్యాబ్, లారీ, బస్సు, ట్రక్కు డ్రైవర్లు, జాయింట్ యాక్షన్ కమిటీల (జేఏసీ)ల యాజమాన్యాలు గురువారం నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున్న నిరసలనలో పాలుపంచుకున్న డ్రైవర్లు, వివిధ సంఘాల నాయకులు ట్రాన్స్ పోర్ట్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. నినాదాలు చేస్తూ.. పెద్ద ర్యాలీ తీశారు. గత కొన్ని నెలలుగా పెరిగిన గ్రీన్ ట్యాక్స్, లైఫ్ టాక్స్, రోడ్ టాక్స్, ఫిట్‌నెస్ పెనాల్టీలు వంటి పన్నులను తగ్గించాలని తెలంగాణ డ్రైవర్లు రోడ్డెక్కారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2020 అమలుతో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ఈ నిరసనల్లో సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ (CITU), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC), TRS కార్మిక విభాగం (TRSKV), తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం వంటి అనేక సంఘాలు పాల్గొన్నాయి. ఆందోళనల్లో పాలు పంచుకున్న ఓ నిరసనకారుడు మాట్లాడుతూ.. "ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను పునరుద్ధరించనందుకు ప్రభుత్వం వెంటనే రోజువారీ జరిమానా రూ. 50 ఉపసంహరించుకుంది. మీటర్ రేటు ఇంకా పెరగలేదు మరియు పెట్రోల్-డీజిల్ ధర ఇప్పటికే గరిష్ఠంగా పెరిగాయి. ఒక మధ్యతరగతి వ్యక్తి ఇవన్నీ భరించలేడు.. రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా డ్రైవర్లపై కూడా దృష్టి పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి" అని అన్నారు.
మరో నిరసనకారుడు మాట్లాడుతూ గత రెండేళ్లలో కోవిడ్-19 కారణంగా మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. “ప్రతి వస్తువు ధర నిరంతరం పెరుగుతూనే ఉంది. దానికి తోడు ప్రభుత్వం మాకు ప్రతిరోజూ రూ. 50 జరిమానా విధించింది” అని తెలిపారు. నిరసనకారులు ఖైరతాబాద్ సమీపంలో "మాకు న్యాయం కావాలి" అని నినాదాలు చేస్తూ రోడ్డుపై ప్లకార్డులతో ర్యాలీ ప్రారంభించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కాగా, డ్రైవర్స్ జేఏసీ చేపట్టిన బంద్‌తో బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో ఆటో(Auto)లు, క్యాబ్‌లు(cabs), లారీలు(lorrys) సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లను నిలువు దోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. న్యూమోటర్ వెహికల్ చట్టం (New Motor Vehicle Act)2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక్క రోజు వాహనాల బంద్‌కు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఐకాస పిలుపునిచ్చింది.
