Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ ‘‘టీ.వ్యాలెట్‌’’ను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి (వీడియో)

ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలన్నీ ఒకే యాప్‌లో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘‘ టీ.వ్యాలెట్’’ను రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టీసీఆర్టీసీకి సంబంధించిన ‘‘టీ-వ్యాలెట్‌’’ను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి  ప్రారంభించారు. 

Telangana transport minister mahender reddy launches TSRTC T Wallet

ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలన్నీ ఒకే యాప్‌లో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘‘ టీ.వ్యాలెట్’’ను రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టీసీఆర్టీసీకి సంబంధించిన ‘‘టీ-వ్యాలెట్‌’’ను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి  ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి టీ. వ్యాలెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు.

ఆర్టీసీ ప్రతిరోజు దూర ప్రాంతాలకు వెళ్లే 13 వేల మందిలో 6 వేల మందికి ఆన్‌లైన్‌ టికెట్లు ఇస్తుందన్నారు.. తెలంగాణ నుంచి 900 అంతర్రాష్ట్ర సర్వీసులు నడుస్తున్నాయని.. రానున్న కాలంలో వీటిని పెంచుతామన్నారు. టీ. వ్యాలెట్‌తో 30 రోజుల  ముందే సీట్ రిజర్వేషన్ అవుతుందని.. ఎస్ఎంఎస్ ద్వారా దీనికి సంబంధించిన సమాచారం వస్తుందన్నారు. రవాణా శాఖలో ఎం.వ్యాలెట్ ద్వారా 20 లక్షల మందికి వాహన సమాచారం అందించి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

"

Follow Us:
Download App:
  • android
  • ios