ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 40 లక్షల కేసుల బీర్లు తెలంగాణలో అమ్ముడుపోయాయట.

దేశవ్యాప్తంగా బీరు బలులు తెలంగాణలోనే ఎక్కువున్నారట. అసలే వేసవి కాలం కావడంతో టైం దొరకితే మనోళ్లు చల్లటి బీర్లు పీపాలు పీపాలు తాగేస్తున్నారుకుంట. అందుకే దేశం మొత్తంలో ఫస్టు ప్లేస్ లో తెలంగాణ దూసుకెళ్లింది.

ఈ సారి ఎండలు మండిపోతున్న వేళ దక్షిణాదిలో బీర్ల వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇందులో తెలంగాణ లో అయితే మరింతగా పెరిగింది. అందుకే ఈ సారి బీరు అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.

 ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 40 లక్షల కేసుల బీర్లు తెలంగాణలో అమ్ముడుపోయాయట. కేసుకు 12 సీసాల చొప్పున ఉన్నాయనుకుంటే మనోళ్లు ఒక్క నెలలోనే 4 కోట్ల 80 వేల బీర్లను ఊదిపారేసారని తెలుస్తోంది.