హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఈసారి వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కూడా హరితహారం కార్యక్రమం చేపట్టాలని  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

 ఒక్కొక్కరు ఒక మొక్క నాటా లని, తద్వారా రాష్ట్రంలో హరితహారం కార్యక్రమానికి చేయూతనిచ్చిన వారవుతారు అని కేటీఆర్ సూచించారు.ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టిన రోజు జరుపుకొనున్నారు. ఈ సందర్భంగా పూల బొకేలు, శాలువాలతో సన్మానాల కంట  ఒక్కొక్క  మొక్క నాటితే మంచిదని సూచించారు. 

 

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం.... ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనతో పుట్టిన కార్యక్రమం అని, ఆయన సంతృప్తి చెందాలంటే  ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇప్పటికే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ ఇండియా పేరుతో హరితహారం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరు ఒక మొక్క నాటుతూ  మరో ముగ్గురికి మొక్కలు నాటాలని పిలుపునివ్వడం గ్రీన్ చాలెంజ్

Also read:కారణమిదే:కేసీఆర్‌తో అక్బరుద్దీన్ భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మరింత ముమ్మరంగా చేపట్టి ఒకే రోజు రికార్డు స్థాయిలో మొక్కలు నాటేందుకు టిఆర్ఎస్ రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చూడాలని జిల్లా
కలెక్టర్లను మంత్రి కేటీఆర్ కోరారు.