Hyderabad: వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో చలికాలం తీవ్రంగా ఉంటుందనీ, దీనివల్ల తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని ఇప్పటికే పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. శీతాకాలంతో సహా వాతావరణ నమూనాలు మారుతున్నాయి. వాతావరణ మార్పు వాతావరణాన్ని మరింత అనూహ్యంగా మారుస్తోందని చాలా ప్రాంతాల్లో ముందుగానే చలి గాలులు వీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Cold Weather: తెలంగాణలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి పెరుగుతోంది. తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ రిపోర్టులు పేర్కుంటున్నాయి. ఆదిలాబాద్‌లో చలి తీవ్రత అధికంగా ఉందనీ, ఇక్కడ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 10.3, మంచిర్యాల 10.9, ఆసిఫాబాద్ 11.4, నిర్మల్ 11.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోయ్యాయి.
హైదరాబాద్ నగరంలో లో కూడా చలి తీవ్రంగా పెరుగుతోంది. నగరంలో ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో హైదరాబాద్ వాసులు చలికి వణికిపోతున్నారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా ప్రకారం.. నగరంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, కార్వాన్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, హయత్‌నగర్, చార్మినార్, సంతోష్‌నగర్‌లో మరో మూడు రోజుల్లో ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో నవంబర్ 18 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. నవంబర్ 18 వరకు, హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత 12-13 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని తెలిపింది. భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్.. నగరవాసులు ఉదయం వేళల్లో పొగమంచు.. చలిని చూస్తారని తెలిపింది. ఇదిలా ఉండగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గే అవకాశం ఉంది. నవంబర్ 18 నాటికి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీమ్, మెదక్, సంగారెడ్డిలలో ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.
శీతాకాలంలో జాగ్రత్తలు...
హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నందున, వెచ్చగా ఉండేందుకు అదనపు శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అన్నింటిలో మొదటిది, వెచ్చని బట్టలు ధరించడం చాలా ముఖ్యం. ఉన్నితో చేసిన బట్టలు అత్యంత వెచ్చగా ఉంటాయి. అలాగే, వేడి పానీయాలు, ఆహారాన్ని తీసుకోవడం కూడా శీతాకాలంలో ప్రజలు వెచ్చగా ఉండటానికి సహాయపడుతుంది. తేలికపాటి వ్యాయామం చేయడానికి సమయాన్ని వెచ్చించాలని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ప్రజలు వ్యాయామానికి దూరంగా ఉన్నప్పటికీ, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్త ప్రసరణను పెంచుతుంది, తద్వారా వెచ్చగా ఉండటానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో చలికాలం తీవ్రంగా ఉంటుందనీ, దీనివల్ల తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని ఇప్పటికే పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. శీతాకాలంతో సహా వాతావరణ నమూనాలు మారుతున్నాయి. వాతావరణ మార్పు వాతావరణాన్ని మరింత అనూహ్యంగా మారుస్తోందని చాలా ప్రాంతాల్లో ముందుగానే చలి గాలులు వీస్తున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
